వరంగల్ లీగల్: హనుమకొండ హంటర్ రోడ్డులోని ‘డీ’కన్వెన్షన్ హాల్‌లో ఈనెల 14(రేపు)న జరగనున్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(ఐఎల్‌పీఏ) తెలంగాణ 6వ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఐఎల్‌పీఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చిల్ల రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. బీఆర్ అంబేడ్కర్ పిలుపునిచ్చిన ‘పే బ్యాక్ టు సొసైటీ’ లక్ష్యంగా బ్లాక్ కోట్స్ ఫర్ బ్ల్యూ రెవెల్యూషన్‌తో ఐఎల్‌పీఏ పనిచేస్తోందన్నారు. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ కమిషన్ చైర్‌పర్సన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈద తిరుమలాదేవి, గౌరవ అతిథులుగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలాగీతాంబ, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత హాజరుకానున్నారన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగే ప్రతినిధుల సభకు ముఖ్య అతి థిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటనారాయణ హాజరై ప్రసంగించనున్నారన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు తీగల జీవన్‌గౌడ్, సాయిని నరేందర్, విలాసాగరం సురేందర్, పులిగిల్ల భిక్షపతి, బండి మొగిలి, షేక్ అబ్దుల్ నబీ, జన్ను పద్మ, రాజు, అనిల్, రాజ్‌కుమార్ ,శ్రీనివాస్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
చిల్ల రాజేంద్రప్రసాద్


