విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలి

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఇన్‌చార్జ్‌ డీఈఓ అనిల్‌ కుమార్‌ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. విద్యార్థులకు డిజిటల్‌ బోధన, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఆధునిక బోధన పద్ధతులు, డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం, ఆలోచన శక్తిని పెంపొందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, జిల్లా సైన్స్‌ అధికారి అప్పారావు, పాఠశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇన్‌చార్జ్‌ డీఈఓ అనిల్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement