కురవి: అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కు రవి మండలం నేరడలో బుధవా రం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బు ర్ర యశోద (75)కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె సరోజనకు వివాహం కాగా చిన్న కుమార్తె శ్రీలత (మానసిక దివ్యాంగురాలు) ఇంట్లోనే ఉంటుంది. కుమారుడు లింగన్నకు పెళ్లి కాగా ఆ ఇంట్లోనే ఉంటుండగా అతడి భార్య తన తల్లిగారివద్ద ఉంటోంది. ఈక్రమంలో యశోద ను కొంతకాలం క్రితం ఓ వృద్ధాశ్రమంలో చేర్పించా రు. కొన్ని రోజుల క్రితం మళ్లీ నేరడలోని ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈక్రమంలో యశోద ఇంట్లోనే చద్దర్లు కప్పుకుని నిద్రిస్తున్నట్లు చనిపోయి ఉంది. ఈ ఘటన సు మారు పది రోజుల క్రితం జరిగినట్లు కనిపిస్తోంది. మృతదేహం ఇంట్లోనే ఉండగా కుమారుడు, కుమా ర్తె రోజువారీ కార్యక్రమాలు(ఆహారం వండుకోవడంతోపాటు ఇతర పనులు) చేసుకుంటున్నారు. రెండుమూడు రోజుల నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పరిశీలించారు. నిద్రిస్తున్నట్లు కని పిస్తూ ఎముకలు బయటకు వచ్చాయి. దీంతో వా రు వెంటనే పోలీసులతోపాటు పెద్ద కుమార్తెకు సమాచారమిచ్చారు.ఎస్సై సతీశ్, మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తమ అమ్మను కుమారుడు లింగన్న చంపాడని అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి పెద్ద కుమార్తె సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అస్థిపంజరమైన మృతదేహం
ఆలస్యంగా గుర్తింపు


