● సమయస్ఫూర్తితో కాపాడిన పోలీసులు
ఖిలా వరంగల్ : దంపతుల మధ్య జరిగిన గొడవతో క్షణికావేశానికి లోనైన ఓ యువకుడు(భర్త) రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా జీఆర్ పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి అతడిని కాపాడారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ వి.నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. వరంగల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్–1పై దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి లోనైన భర్త మట్టెవాడకు చెందిన పాక మహేశ్ (32) మంగళవారం కేరళ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించాడు. అప్రమత్తమైన జీఆర్‌పీ హెడ్ కానిస్టేబు ల్ బి.రమేశ్, కానిస్టేబుల్‌ఎం.రాకేశ్ చాకచక్యంగా వ్యవహరించి మహేశ్‌ను రక్షించారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ నరేశ్‌కుమార్.. దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి మహేశ్‌ను తన తల్లి పూలమ్మకు అప్పగించారు. కాగా, సమయస్ఫూర్తితో స్పందించి మహేశ్‌ను కాపాడిన సిబ్బందిని జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.


