ప్రపంచ గుర్తింపే లక్ష్యం.. | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ గుర్తింపే లక్ష్యం..

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

తెలంగాణ

రైతు ఉత్పత్తులకు

భీమదేవరపల్లి: తెలంగాణ సహకార రంగానికి తలమానికంగా నిలిచిన ముల్కనూరు సహకార గ్రా మీణ పరపతి, మార్కెటింగ్‌ సంఘం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. భారత్‌–దక్షిణ కొరియా దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు అసోచామ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి బృందం పర్యటనలో సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి పాల్గొన్నారు. అక్టోబర్‌ 31 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు దక్షిణ కొరియాలో సాగిన ఈ పర్యటనలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ఆహార శుద్ధి సాంకేతికత, అంతర్జాతీయ మార్కెటింగ్‌ అవకాశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆధునిక సాంకేతికతపై అధ్యయన పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాలోని జాతీయ ఆహార పరిశ్రమల సముదాయం ఫుడ్‌పోలిస్‌, నేషనల్‌ ఫిషరీస్‌ సైన్స్‌ మ్యూజియం, సియోల్‌లో జరిగిన కోయెక్స్‌ ఫుడ్‌ వీక్‌–2026 ప్రదర్శనలను ప్రవీణ్‌ రెడ్డి సందర్శించారు. అనంతరం కొరియాలోని ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ రమేశ్‌ అయ్యర్‌, సియోల్‌లోని భారత రాయబార కార్యాలయ ఐఎఫ్‌ఎస్‌ అధికారి మినిదేవి కుమంలతో సమావేశమై.. సహకార సంస్థల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలపై చర్చించారు.

విలువ జోడింపుతోనే రైతు ఆదాయం రెట్టింపు..

ఈ సందర్భంగా అలిగిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి మాట్లాడు తూ రైతుల ఆదాయం పెరగాలంటే ముల్కనూరు సహకార సంఘం తరహాలో సంఘటితమై పనిచేయాలని సూచించారు. కేవలం ముడి పంటల విక్రయానికే పరిమితం కాకుండా, వాటికి విలువ జోడించి (వాల్యు ఎడిషన్‌) అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు తయారు చేయాలన్నారు. ఇప్పటికే ముల్కనూరు రైస్‌, ముల్కనూరు సీడ్స్‌ బ్రాండ్లతో మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు సాధించామని, అమెరికా వంటి దేశాలకు బియ్యం ఎగుమతి చేసే ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటన ద్వారా లభించిన సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య పరిచయాలతో ఆధునిక ప్రాసెసింగ్‌ విధానాలు సంఘంలో అమలు చేస్తామన్నారు. తెలంగాణ రైతు ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ వేదికపై మెరిసిన

ముల్కనూరు సహకార సంఘం

దక్షిణ కొరియాలో ముగిసిన ఉన్నతస్థాయి పర్యటన

అసోచామ్‌ ప్రతినిధి బృందంలో

సంఘం అధ్యక్షుడు ప్రవీణ్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement