వరంగల్ స్పోర్ట్స్ : క్రీడలతో శారీరక, మానసికోల్లా సం కలుగుతుందని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి గిరిరాజ్‌గౌడ్ అన్నారు. జిల్లా ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని జేఎస్‌ఎస్‌లో 70వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎస్ జీఎఫ్ అథ్లెటిక్స్ మీట్ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలుర అండర్–14 విభాగంలో నిర్వహించిన 100 మీటర్ల పరుగుపందెం విజేతలకు డీఈఓ మెడల్స్, బహుమతులు అందజేశారు. పోటీల్లో వరంగల్‌కు చెందిన వర్సా ప్రదీప్ 11.50 సెకన్లలో లక్ష్యం చేరుకుని ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన ఓం రాజేంద్ర కుంభార్ 11.90 సెకన్లతో ద్వితీయ స్థానం, ఆదిలాబాద్‌కు చెందిన షేక్ రెహాన్ 12.20 సెకన్లతో తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. రాష్ట్ర, జా తీయ స్థాయిలో ప్రతిభ చాటి జిల్లా, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. సారంగపాణి, అసోసియేషన్ అబ్జర్వర్ డాక్టర్ సొలపోగుల స్వాములు, పీఈటీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. ప్రభాకర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ గిరిరాజ్ గౌడ్


