● ఓఎస్‌డీ వెంకట్రామ్‌రెడ్డి
కేయూ క్యాంపస్: విద్యార్థులు చదువుతోపాటు తమకిష్టమైన క్రీడల్లోనూ రాణించాలని కేయూ ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లలో విజేత జట్లతో ఇంటర్ జోనల్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌ను మంగళవారం కేయూలోని స్పోర్ట్స్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల క్రీడల్లో స్ఫూర్తితో పాల్గొనాలని కోరారు. తొలుత ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు.. ఉమ్మడి వరంగల్ క్రికెట్ జట్టుతో తలపడింది. ఇందులో ఉమ్మడి వరంగల్ విజయం సాధించింది. బుధవారం కూడా ఈపోటీలు కొనసాగుతాయి. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్‌కు ఎంపిక చేస్తారని కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ టి. శాస్త్రి తెలిపారు. ఇంటర్‌కాలేజియెట్ క్రీడల ఇన్‌చార్జ్ ఎస్. కుమార్, ఫిజికల్ డైరెక్టర్ల అసోసియేషన్ కేయూ అధ్యక్షుడు జె. సోమన్న, ఫిజికల్ డైరెక్టర్లు వెంకన్న, గోపికృష్ణ, మట్టెడ కుమారస్వామి, అప్జల్ అస్లాం, తదితరులు పాల్గొన్నారు.


