దీపావళి వేళ అగ్ని ప్రమాదం.. | - | Sakshi
Sakshi News home page

దీపావళి వేళ అగ్ని ప్రమాదం..

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

భూపాలపల్లి అర్బన్‌ : దీపావళి వేళ జరిగిన అగ్నిప్రమాదం చిరు వ్యాపారుల కుటుంబాల్లో తీరని విషా దాన్ని నింపింది. భూపాలపల్లి ఫారెస్ట్‌ కార్యాల యం ఎదుట జాతీయ రహదారి ఫుట్‌పాత్‌పై తా త్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకుని పూలు, దేవుళ్ల ఫొ టోలు విక్రయించడంతోపాటు వాచ్‌రిపేర్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరువ్యాపారుల దు కాణాలు ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంట ల్లో దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదు పు చేశారు. అయితే అప్పటికే దుకాణాల్లోని సామగ్రి, వ్యాపారానికి సమకూర్చుకున్న పెట్టుబడి పూర్తి గా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పర్థం బుమయ్య, వీర్నాల జానీ, వీర్నాల లక్ష్మి, మల్లికార్జున్‌ దుకాణా లు దగ్ధమయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు.

కళ్లెదుటే బూడిదైన జీవనాధారం..

రోజూ పూలు విక్రయిస్తేనే కుటుంబాలకు పూట గడిచే పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా కష్టపడి కూడబెట్టుకు న్న పెట్టుబడితో వ్యాపారం చేసుకుంటున్న తమకు అగ్నిప్రమాదం రూపంలో పెద్ద దెబ్బ తగిలిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్న ఒక్క టే జీవనాధారం కళ్లెదుటే కాలిపోవడంతో బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థిక సాయం అందించడంతో పాటు తిరిగి వ్యాపారం చేసుకునేలా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దగ్ధమైన దుకాణాలను ఆర్‌ఐ రామస్వామి, జీపీఓ కృష్ణమూర్తి పరిశీలించి నష్టాన్ని నమోదు చేశారు.

బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

అగ్నిప్రమాదంలో దగ్ధమైన వ్యాపార షెడ్లను ఎమ్మె ల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం పరిశీ లించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. బాధితులకు న్యాయం జరిగేలా కలెక్టర్‌, సంబంధిత అధికారులతో మాట్లాడతానని తెలి పారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు శ్రీని వాస్‌, తదితరులు పాల్గొన్నారు.

నాలుగు దుకాణాలు దగ్ధం

రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల

వరకు ఆస్తి నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement