● నెలరోజులపాటు శైవక్షేత్రాల్లో
ప్రత్యేక పూజలు
మహబూబాబాద్ రూరల్: శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన ‘కార్తీక మాసం’ నేటినుంచి (మంగళవారం) ప్రారంభం కానుంది. పట్టణంలోని శ్రీఉమాచంద్రమౌళీశ్వరాలయం, శ్రీపార్వతి రామలింగేశ్వరాలయం, శ్రీభక్తమార్కండేయ శివాలయం, శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, మహాగాయత్రీ దేవాలయంలో నెలరోజుల పాటు కార్తీక మాస పూజలు జరుగనున్నాయి. అలాగే జిల్లాలోని శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. కార్తీక మాసంలో శివుడికి భక్తులు వివిధ రకాల అభిషేకాలు చేయిస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుందని ఆయా దేవాలయాల అర్చకులు తెలిపారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం శివాలయాల్లో కార్తీక మాస అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. 24వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో లఘున్యాసపూర్వక, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతాయన్నారు.
ఇన్‌చార్జ్ కమిషనర్‌గా డీఈ ఉపేందర్
మహబూబాబాద్: మున్సిపాలిటీ డీఈగా పని చేస్తున్న సీహెచ్ ఉపేందర్ ఈ నెల 6 నుంచి ఇన్‌చార్జ్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. కమిషనర్ ఎం.వినోద్‌కుమార్ ఆరోగ్య రీత్యా ఈనెల 6 నుంచి 13వ తేదీ వరకు సెలవు పెట్టారని అధికారులు పేర్కొన్నారు. దీంతో కలెక్టరేట్ నుంచి డీఈ ఉపేందర్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించిన్నట్లు అధికారులు తెలిపారు.
పాఠశాల విద్య వరంగల్
ఆర్‌జేడీగా వెంకటనర్సమ్మ
విద్యారణ్యపురి: పాఠశాల విద్య వరంగల్ ఆర్‌జేడీగా (రీజనల్ జాయింట్ డైరెక్టర్) ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్‌ఏసీ) బి.వెంకటనర్సమ్మను నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం వెంకటనర్సమ్మ హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలం క్రితమే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మీకి వరంగల్‌కు పోస్టింగ్ ఇవ్వగా ఆమె బాధ్యతలు చేపట్టలేదు. సెలవుల్లో కొనసాగుతున్నారు. దీంతో ఆమెస్థానంలో వెంకటనర్సమ్మకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ప్రభంజన్
మహబూబాబాద్ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ తైక్వాండో పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ప్రభంజన్ ఎంపికై య్యాడని లయన్స్ తైక్వాండో అకాడమీ కోచ్ లావుడ్య రాంబాబు సోమవారం తెలిపారు. ఈ మేరకు గద్వాల్ జిల్లాలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రభంజన్‌ను ఉపాధ్యాయులు, కోచ్‌తోపాటు తల్లిదండ్రులు అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ కనబర్చాలని కోరారు.
అంగన్‌వాడీ అభ్యర్థుల జాబితా ప్రదర్శన
మహబూబాబాద్: అంగన్‌వాడీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హుల, అనర్హులైన ప్రాథమిక జాబితాను గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయం, పట్టణాల్లో అయితే మున్సిపాలిటీ కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు జాబితాలో తమ పేర్లు లేదా అర్హతలకు సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు తగిన ఆధారాలతో సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభ్యంతరాలు ఉంటే ఈనెల 13లోగా సమర్పించాలన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్: డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారత, సంక్షేమం అభివృద్ధి రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి అవార్డులు పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డులకు సంబఽంధించి వ్యక్తి గత విభాగం, సంస్థాగత విభాగాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆయా రంగాల్లో విశేష సేవలు, విజయాలు సాధించిన అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసు కోవాలన్నారు. దరఖాస్తులు ఈనెల 15 లోపు జిల్లా సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


