మహబూబాబాద్ అర్బన్: పేద ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించే లక్ష్యంతో ప్రజలందరికీ సమానమైన న్యాయ సేవలను అందిస్తుందని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి.నాగేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో సోమవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 1995 నవంబర్ 9న ఉచిత న్యాయం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిందని, దీంతో ప్రతి సంవత్సరం 9వ తేదీన జాతీయ సేవల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చెన్న మాల్లారెడ్డి, వెంకటేష్, హెచ్ఎం బాబునాయక్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


