కేయూ క్యాంపస్: హైదరాబాద్‌లోని ఉమెన్స్ యూనివర్సిటీలో ఈనెల 9నుంచి ప్రారంభమై 12వ తేదీ వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ టోర్నమెంట్లో పాల్గొననున్న కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ డాక్టర్ టి.శాస్త్రి సోమవారం తెలిపారు. జట్టులో చిలకబత్తిని నవ్య, పూజశ్రీపుప్పాల, మాధురి కర్జ్, బచ్చలి నవ్య, కోరం పూజిత, కుర్సమ్ సాహిత్య, ఉన్నారు. జట్టుకు టీజీటీ డబ్ల్యూఆర్‌డీసీ(ఖమ్మం) ఫిజికల్ డైరెక్టర్ బి. రమ్య, కోచ్‌కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని శాస్త్రి తెలిపారు.


