గూడూరు:మండలకేంద్రంలోని చెంద్రుగూడెంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్ర తీకగా జరుపుకునే నరకాసుర వధ వేడుకలను సత్యభామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రెండు గంటల పాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం 40 అడుగుల ఎత్తు గల నరకాసురుడి ప్రతిమను మాజీ సర్పంచ్ నూనావత్ రమేష్, ఎంపీటీసీ కత్తి స్వామి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పింగిళి శ్రీనివాస్, యూత్‌క్లబ్ ప్రతినిధులు కలిసి దహనం చేశారు.
దహనమవుతున్న నరకాసుర ప్రతిమ


