హసన్‌పర్తి : ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి ఆత్మహత్యకు సిద్ధమైన ఓ వ్యక్తిని బ్లూకోల్ట్స్ సిబ్బంది కాపాడారు. అనంతరం పీఎస్‌కు పోలీస్‌స్టేషన్‌కుతరలించి కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని గుండ్లసింగారానికి చెందిన ఓ వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఆందోళనకు గురయ్యాడు. దీంతో శుక్రవారం సాయంత్రం ఇంటిలో చెప్పకుండా బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురై పలుచోట్ల గాలించారు. అయినా ఆచూకీ లభ్యంకాకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు మొబైల్‌ఫోన్ లోకేన్ ఆధారంగా సదరు వ్యక్తి చింతగట్టు రైల్వే ట్రాక్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్సై శ్రావణి అప్రమత్తమై బ్లూకోల్ట్స్ సిబ్బందిని ఘటనాస్థలికి పంపించారు. అప్పటికే రైలు సమీపిస్తున్నట్లు గమనించి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తిని బ్లూకోల్ట్స్ కాపాడారు. కాగా, వ్యక్తి ప్రాణం కాపాడిన బ్లూకోల్ట్స్ సిబ్బంది వీరస్వామి, తరుణ్‌కుమార్‌ను సీపీ శ్వేత అభినందించి నగ దు రివార్డులు అందజేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, కేయూ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని
కాపాడిన బ్లూకోల్ట్స్ సిబ్బంది


