తొలిముద్ద భరోసా.. | - | Sakshi
Sakshi News home page

తొలిముద్ద భరోసా..

Nov 8 2026 4:59 AM | Updated on Nov 8 2026 4:59 AM

అంగన్‌వాడీ కేంద్రాల్లో పెరుగుతున్న చిన్నారుల హాజరు, నమోదు

మహబూబాబాద్‌: అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం పాటుపడుతుంది. ఇందులో భాగంగా ఆ వ్యవస్థలో ఖాళీగా ఉన్న పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో కేంద్రాల్లో చిన్నారుల ఆలనాపాలన చూడడంతోపాటు వారికి రోజూవారీగా అందించే ఆహారంతోపాటు తొలిముద్ద పేరుతో అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాలను ఎంపిక చేసి పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఈకార్యక్రమాన్ని చేపట్టగా.. అందులో మానుకోట జిల్లాకు కూడా ప్రభుత్వం స్థానం కల్పించింది.

1,437 కేంద్రాలు

జిల్లాలో ఐదు ప్రాజెక్ట్‌లు ఉండగా 1,437 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మానుకోట ప్రాజెక్ట్‌ కింద మానుకోట, కేసముద్రం, ఇనుగుర్తి, బయ్యారం మండలాలు ఉన్నాయి. మరిపెడ ప్రాజెక్ట్‌ కింద చిన్నగూడూరు, దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ ఉండలాలు ఉన్నాయి. గూడూరు ప్రాజెక్ట్‌ కింద గంగారం, కొత్తగూడ, గూడూరు మండలాలు, తొర్రూరు ప్రాజెక్ట్‌ కింద పెద్ద వంగర, నెల్లికుదురు. తొర్రూరు, డోర్నకల్‌ ప్రాజెక్ట్‌ కింద గార్ల, కురవి, సీరోలు డోర్నకల్‌ మండలాలు ఉన్నాయి.

35,686 మంది పిల్లలు

జీరో నుంచి ఆరు నెలలలోపు పిల్లలు 2,961 మంది, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు 16,818 మంది, మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలలోపు 15,907 మంది మొత్తం 35,686 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. గర్భిణులు 3,677 మంది బాలింతలు 2,893 మంది ఉన్నారు. మూడు సంవత్సరాలలోపు పిల్లలకు టీహెచ్‌ఎస్‌ (ఇంటి వద్దకే రేషన్‌) కింద నెలకు 16 గుడ్లు, ఒక బాలామృతం ప్యాకెట్‌ ఇస్తున్నారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలలో నెల రోజుల క్రితం వరకు ప్రతీ రోజు గుడ్డు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలు నిర్వహిస్తున్నారు.

1,309 మంది టీచర్లు

1,309 మంది టీచర్లు,న, 957 మంది ఆయాలు, 49 మంది సూపర్‌ వైజర్లు పని చేస్తున్నారు. 475 కేంద్రాలు అద్దె భవనాల్లో, 336 కేంద్రాలు సొంత భవనాల్లో, 626 కేంద్రాలు ఫీరెంటెండ్‌ (అద్దె లేకుండా ప్రభుత్వ పాఠశాలలో) నిర్వహిస్తున్నారు. ఖాళీ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల కాగా ఆ ప్రక్రియ కొనసాగుతుంది.

అన్ని కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం

తొలిముద్ద కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. దీంతో హాజరు శాతం, పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వారి ఆరోగ్యాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకుని అమలు చేస్తున్నాం. – శిరీష, ఇన్‌చార్జ్‌ డీడబ్ల్యూఓ

కేంద్రాలకు రెడీమిక్స్‌ సరఫరా

సెప్టెంబర్‌ 25వ తేదీన కలెక్టరేట్‌లో తొలిముద్ద కార్యక్రమంపై టీచర్లు, ఆయాలకు శిక్షణ ఇచ్చారు. ఇందులోభాగంగా ఉక్మా, కిచ్చిడి రెడీమిక్స్‌ను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తారు. వాటిలో వేడి నీరు పోసి కలిపితే అల్పాహారం తయారుఅవుతుంది. ఈకార్యక్రమాన్ని అక్టోబర్‌ 1న కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌, కలెక్టర్‌ స్నేహశబరీష్‌ ప్రారంభించారు. ఆతర్వాత రోజు నుంచి అన్ని కేంద్రాల్లో అమలు చేస్తున్నారు. దీంతో పలుకేంద్రాల చిన్నారుల హాజరు శాతం, పిల్లల సంఖ్య కూడా మెరుగుపడినట్టు సమాచారం.

హర్షం వ్యక్తం చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు

పైలట్‌ ప్రాజెక్టుగా జిల్లాలో కొనసాగుతున్న కార్యక్రమం

అన్ని కేంద్రాల్లో నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement