అర్హులకు మరో అవకాశం | - | Sakshi
Sakshi News home page

అర్హులకు మరో అవకాశం

Nov 8 2026 4:59 AM | Updated on Nov 8 2026 4:59 AM

మహబూబాబాద్‌: సర్‌ –2026 ప్రక్రియలో ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లకు తమ పేర్లను తుది ఓటరు జాబితాలో చేర్చుకునేందుకు మరో అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సర్‌ ప్రక్రియలో ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం కల్పించినట్లు తెలిపారు. చిరునామాలో మార్పులు ఇతరత్రా చేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్నేహశబరీష్‌ మాట్లాడుతూ.. జిల్లాలో పూర్తిస్థాయిలో ఉన్న రెండు నియోజకవర్గాలలో సర్‌ ప్రక్రియలో 47,979 మంది ఓటర్లను ఏఎస్‌డీడీ కేటగిరి కింద గుర్తించామన్నారు. వారిలో మరణించిన వారు 9,359, శాశ్వతంగా నివాసం మారినవారు 28, 979 మంది, డూప్లికేట్‌ 8,879 మంది, వివరాలు తెలియనివారు 634 మంది, ఇతరులు 128 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వీసీలో జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, డీఆర్వో నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులు ప్రతిభ చాటాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పట్టుదలతో క్రీడలో ప్రతిభ చాటాలని జిల్లా గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ గుగులోతు దేశీరాంనాయక్‌ అన్నారు. మానుకోట మండలం రెడ్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో డివిజన్‌ క్రీడల ముగింపు క్రీడల కార్యక్రమానికి దేశీరాంనాయక్‌ హాజరై ముందుగా క్రీడాకారులకు టీ షర్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ.. క్రీడాస్ఫూర్తితో ఆటలు ఆడి డివిజన్‌ స్థాయి క్రీడలో రాణించాలన్నారు. అనంతరం క్రీడాకారులతో కాసేపు కబడ్డీ ఆడారు. కార్యక్రమంలో ఏటీడీఓ ఉపేందర్‌, ఏసీఎంఓ రాములు, క్రీడల అధికారి కొమ్మలు, పోరిక అనిల్‌ కుమార్‌, కిషన్‌నాయక్‌, హెచ్‌ఎంలు సక్రు, బాబు, కిషన్‌నాయక్‌, పీడీలు శంకర్‌, రాజన్న, సుదర్శన్‌, సుశీల, భాస్కర్‌, లక్ష్మి, రమేష్‌, నాగేశ్వర్‌రావు, ప్రవీణ్‌, సర్పంచ్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఎంజీఎంకు నలుగురు అదనపు ఆర్‌ఎంఓలు

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి నలుగురు అదనపు ఆర్‌ఎంఓలు రానున్నారు. అలాగే, కాకతీయ వైద్యకళాశాలకు కూడా నలుగురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల (మెడికల్‌)ను ఎంపిక చేశారు. ఎంజీఎంకు అదనపు ఆర్‌ఎంఓలతోపాటు వైద్యుల కొరత లేకుండా చూస్తామని ఇటీవల డీఎంఈ డాక్టర్‌ వాణి ఇచ్చిన హామీ నెరవేరడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 31న కాంట్రాక్టు పద్ధతిన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకం కోసం కేఎంసీలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, మరో నలుగురు ఆర్‌ఎంఓలను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో కేఎంసీ అనాటమీకి ఇద్దరు, ఎస్‌పీఎం (కమ్యూనిటీ మెడిసిన్‌)కు మరో ఇద్దరిని కేటాయించారు. దీంతో ముగ్గురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు జాయిన్‌ కాగా మరొకరు సోమవారం జాయిన్‌ కానున్నారు. అలాగే, ఎంజీఎం నలుగురు అదనపు ఆర్‌ఎంఓలు కేటాయించగా ఇద్దరు జాయిన్‌ అయ్యారు. మరో ఇద్దరు సోమవారం విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది.

రామప్పలో రష్యా దేశస్తులు

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని రష్యా దేశస్తులు డేనీస్‌ ఎల్డండి, విక్టోరియా మొజా వా శనివారం సందర్శించారు. రామలింగేశ్వర స్వామి వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవా లయం చరిత్ర, శిల్పకళ వైభవాన్ని టూరిజం గైడ్‌ వెంకటేశ్‌ వారికి వివరించగా శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement