ఆరోగ్యసూత్రాలు ఇలా..
నేడు జాతీయ క్యాన్సర్
అవగాహన దినోత్సవం
సాక్షి, వరంగల్: క్యాన్సర్.. పేరు వింటేనే భయం. కానీ ప్రారంభ దశలో గుర్తిస్తే వ్యాధిని జయించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అవగాహన లోపం, లక్షణాల నిర్లక్ష్యం, పరీక్షలకు వెనుకాడటంతో చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే ఆస్పత్రుల కు వెళ్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ క్యా న్సర్ కేసుల నమోదు రేటు ఆందోళన కలిగిస్తోంది. అయితే తెలంగాణ క్యాన్సర్ అట్లాస్–2026 ప్రకారం రాష్ట్రంలో లక్ష జనాభాకు ఏడాదికి సగటున 52 కేసులు నమోదవుతున్నట్లు తేలింది. హనుమకొండలో ఈ సంఖ్య 79గా ఉండగా.. రాష్ట్రంలోనే అత్యధిక నమోదు రేటుగా నిలిచింది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ లక్ష జనాభాకు 55 నుంచి 59 కేసుల మధ్య నమోదవుతున్నాయి. క్యాన్సర్ చికిత్స పొందినవారి లో మహిళలు ఎక్కువగా ఉన్నారు. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు మహిళల్లో ప్రధానంగా కనిపిస్తుండగా.. పురుషుల్లో నోటి, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. పొగా కు, గుట్కా, ఖై నీ, ధూమపా నం అలవాట్లు క్యా న్సర్ ముప్పును పెంచుతున్నాయి. ఈనేపథ్యంలో నేడు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
స్క్రీనింగ్‌పై నిర్లక్ష్యం..
అలవాట్లతో ఆగమాగం..
ఐసీఎంఆర్–ఎన్‌సీడీఐఆర్ నివేదిక ప్రకారం 30 నుంచి 49 ఏళ్ల మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నవారు 3.3 శాతం మాత్రమే. రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నవారు 0.3 శాతమే. నోటి క్యాన్సర్ పరీక్షలపైనా అవగాహన తక్కువగా ఉంది. నోటిలో పుండ్లు తగ్గకపోవడం, రొమ్ములో గడ్డలు, అసాధారణ రక్తస్రావం, దీర్ఘకాలిక దగ్గు, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు.
ఎంజీఎంలోనూ ప్రత్యేక చికిత్సలు..
క్యాన్సర్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో రేడియేషన్ అంకాలజీ డిపార్ట్‌మెంట్‌లోని డే కేర్ వార్డులో 50 నుంచి 60 వరకు రోజు ఓపీలు ఉండగా, 15 నుంచి 20 మందికి కిమియోథెరపీ చేస్తున్నారు. అదే సమయంలో మెడికల్ అంకాలజీ డిపార్ట్‌మెంట్‌లో రోజుకు ఐదు నుంచి ఆరుగురికి కిమియోథెరపీ చేస్తున్నారు. అలాగే అత్యవసరమున్న రోగులను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు 15 మెడికల్ అంకాల జీ, 15 రేడియేషన్ అంకాలజీ బెడ్‌లు అందుబాటులో ఉన్నాయని అంకాలజీ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ, అసోసియేట్ ప్రొఫెసర్ సుధారాణి తెలిపారు. త్వరలోనే 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ అందుబాటులోకి వస్తే అందులో ప్రత్యేక బ్లాక్‌లో అత్యాధునిక వసతులతో కిమియోథెరపీతోపాటు రేడియోథెరపీ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.
పొగాకు, మద్యపానానికి దూరంగా
ఉండాలి.
ఆకుకూరలు, కూరగాయలు,
పండ్లు తీసుకోవాలి.
రోజూ కనీసం 30 నిమిషాలు
వ్యాయామం చేయాలి.
30 ఏళ్లు దాటినవారు వైద్యుల సూచన మేరకు నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.
హెచ్‌పీవీ, హెపటైటిస్–బీ టీకాల
గురించి వైద్యులను సంప్రదించాలి.
రాష్ట్రంలోనే అత్యధికంగా
హనుమకొండలో లక్ష జనాభాకు
79 కేసులు
స్క్రీనింగ్‌పై నిర్లక్ష్యం..
ఆలస్యంగా వ్యాధి నిర్ధారణతో ముప్పే
జీవనశైలిలో మార్పులు,
ముందస్తు పరీక్షలతో ముప్పు తగ్గింపు
ఎక్కువగానే కేసులు..
వరంగల్ జిల్లా వైద్యారోగ్య అధికారుల వద్ద ఉన్న సమాచారం మేరకు జిల్లాలో 762 క్యాన్సర్ కేసులు గుర్తించారు. వీటిలో 335 ఓరల్, 245 బ్రెస్ట్, 182 సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్టుగా తేల్చారు. ఇవీ కేవలం హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, ఎంజీఎంలోని క్యాన్సర్ చికిత్స కేంద్రాల నుంచి వచ్చిన సమాచారం మాత్రమే. అలాగే హనుమకొండ జిల్లాలోనూ 987 కేసులున్నట్టుగా తెలిసింది. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరిన వారు వందల సంఖ్యలోనే ఉండొచ్చని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి వరంగల్‌లో ఆందోళన కలిగిస్తున్న కేసుల నమోదు


