అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

ఏటూరునాగారం/తాడ్వాయి: అటవీ సంపదను కాపాడుతూ.. వన్యప్రాణుల రక్షణకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, జిల్లా అటవీ అధికారి వికాస్‌ మీనాలతో కలిసి తాడ్వాయి అటవీ ప్రాంతం, ఏటూరునాగారం అభయారణ్యం, జలగలంచ, దుర్గం గుట్ట, కొండాయి ఫారెస్ట్‌ వాచ్‌ టవర్‌, గొత్తి కోయ హబిటేషన్‌ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. దట్టమైన అడవులు, జీవవైవిధ్యం ములుగు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు అని కొనియాడారు. వన్యప్రాణులను వేటాడటం అమానవీయమని పేర్కొన్నారు. ఇటువంటి వారిని గుర్తించి, కారణాలను విశ్లేషించి బాధ్యులపై చట్టప్రకారం చర్య తీసుకోవాలన్నారు. వన్యప్రాణుల రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు వేటను అరికట్టేందుకు పోలీసు, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అడవిలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. వన్యప్రాణుల వేట, అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని చె ప్పారు. చింతలమోరి ప్రాంతంలోని గొత్తికోయల గుంపును సందర్శించి వారి జీవన పరిస్థితులు, ఉపాధి అవకాశాలను పరిశీలించినట్లు చెప్పారు. అడవులను నరికివేయకుండా జీవనోపాధి పొందేందుకు వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించవచ్చనే అంశంపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. పర్యటనలో పరిశీలించిన అంశాలపై రాష్ట్ర మంత్రి సీతక్కతో చర్చించి.. ఆమె సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.ఎల్‌నినోపై ముందస్తు కార్యాచరణ అవసరం..

ఎల్‌నినో ప్రభావాలపై ముందస్తు కార్యాచరణ అవసరమని జయేశ్‌రంజన్‌ జిల్లా అధికారులకు సూచించారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించను న్న గ్లోబల్‌ సమ్మిట్‌లో ఈ అంశంపై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం, తాగు , సాగునీరు, అటవీ జీవులతోపాటు అధిక ఉష్టోగ్రతల్లో పనిచేసే కార్మికులు, గిగ్‌ వర్కర్లపై పడే ప్రభావాలను చర్చించనున్నట్లు వివరించారు.

గొత్తికోయలకు ప్రత్యామ్నాయ

ఉపాధిపై దృష్టి సారించాలి

రాష్ట్ర పర్యావరణ, అటవీ,

శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌

రామప్ప శిల్పకళా సంపద అద్భుతం

ములుగు: రామప్ప దేవాలయ శిల్పకళ, నిర్మాణ నైపుణ్యం అద్భుతమని జయేశ్‌ రంజన్‌ కొనియాడారు. కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. కాకతీయు ల కాలం నాటి నిర్మాణ పద్ధతులు, నీటిలో తేలియాడే ఇటుకలు, సాండ్‌బాక్స్‌ సాంకేతికత, శిల్పకళా విశేషాలను పర్యాటక గైడ్‌ విజయ్‌ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రసాద్‌ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, పర్యాటకులకు కల్పిస్తున్న సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. ఆయన వెంట అటవీ శాఖ అధికారి వికాస్‌ మీనా, ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement