భర్తను కడతేర్చిన భార్య, ప్రియుడు ? | - | Sakshi
Sakshi News home page

భర్తను కడతేర్చిన భార్య, ప్రియుడు ?

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

భూపాలపల్లి రూరల్‌: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్దారం గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామస్తులు, మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మండలంలోని లంబాడి తండా(బి)కు చెందిన అజ్మీరా చందు(35) భార్య పావని, ఇద్దరు పిల్ల లతో గ్రామంలో కూలీ చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో భార్య పావని.. ఇదే గ్రామానికి చెంది న దారవత్‌ సంతోష్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. దీంతో భార్యాభర్తల మధ్య తర చూ గొడవలు జరగడంతో పెద్దల సమక్షంలో పంచాయతీలు నిర్వహించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి పావని–సంతోష్‌ కలిసి ఉండగా చందు చూసినట్లు తెలిసింది. దీంతో తమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని ఇద్దరు కలిసి గొడ్డలి తో చందు తలపై బలంగా కొట్టడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నేరం తమపైకి రాకుండా ఉండేందుకు శుక్రవారం తెల్లవారుజామున చందు మృతదేహన్ని ఎడ్లబండిపై తీసుకెళ్లి చికెన్‌పల్లి శివారులో రోడ్డు పక్కన పొలం గట్టుపై వేశారు. ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులు మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ శ్రీనివాస్‌, ఎస్సై మహేష్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు. చందు తమ్ముడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. అయితే పావనితోపాటు సంతోష్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది.

దిక్కుతోచని స్థితిలో చిన్నారులు..

తండ్రి మృతిచెందడం.. తల్లి పోలీసుల అదుపులో ఉండడంతో చిన్నారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గుక్కపెట్టి ఏడుస్తూ తండ్రికి తలకొరివి పెట్టిన తీరును చూసినవారంతా కన్నీరుపెట్టుకున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను చిధ్రం చేస్తున్నా మార్పు రావండలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గొల్లబుద్ధారం న్యూ లంబాడి తండాలో ఘటన

పోలీసుల అదుపులో నిందితులు..?

అనాథలైన ఇద్దరు చిన్నారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement