రఘునాథపల్లి: ఆర్థిక ఇబ్బందులతో గురువారం ఆత్మహత్యకు పాల్పడిన జనగామ జిల్లా రఘునాథపల్లి మాజీ జెడ్పీటీసీ, బీఆర్‌ఎస్ నాయకుడు బొల్లం అజయ్ అంతిమ యాత్ర శుక్రవారం ముగిసింది. అజయ్ మృతి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, అరూరి రమేష్ తదిరులు శుక్రవారం అజయ్ నివాసానికి చేరుకొని ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాడ సానుభూతి తెలియజేశారు. మృతదేహం వద్ద ఐదు, రెండేళ్ల కుమారులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
పాడె మోసి, డప్పు కొట్టిన రాజయ్య
అజయ్ అంతిమయాత్రలో పాల్గన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. పాడె మోసి డప్పు కొట్టారు. ఆరు గంటలపాటు సాగిన అంతిమ యాత్రలో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది పెద్ద ఎత్తున తరలి వచ్చి అజయ్‌కు తుది వీడ్కోలు పలికారు. నివాళులర్పించిన వారిలో గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, గుడి వంశీధర్‌రెడ్డి, లింగాల జగదీశ్ చందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్ పోకల శివకుమార్, గాదె మహేందర్‌రెడ్డి, కోళ్ల రవిగౌడ్, బొమ్మ వీరస్వామి, వారాల రమేష్, ముసిపట్ల విజయ్, మేకల నరేందర్, కావటి రాజయ్య తదితరులు ఉన్నారు.


