నీటి పారుదలశాఖ ఆస్తుల జప్తు | - | Sakshi
Sakshi News home page

నీటి పారుదలశాఖ ఆస్తుల జప్తు

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

బిల్లుల విషయంలో కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్‌

ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ కార్యాలయంలో ఫర్నిచర్‌, కంప్యూటర్లు ఇతరత్రా సామగ్రిని మంగళవారం జిల్లా కోర్టు ఫీల్డ్‌ అసిస్టెంట్లు జితేందర్‌రెడ్డి, సత్యనారాయణ జప్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌ వెంకటేశ్వర్లు 1985లో ఎస్సారెస్పీ కాల్వ పనులు చేశారని, అయితే నేటికీ బిల్లులు రాలేదని ఆయన హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారడన్నారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్‌ శాఖ కార్యాలయం ఆస్తులు జప్తు చేయాలని సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి తీర్పు నిచ్చారన్నారు. ఆ వారెంట్‌ను జిల్లా కోర్టుకు పంపారని, కోర్టు ఆదేశాలతో ఆస్తుల జప్తు చేశామన్నారు. ఈ విషయంపై ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ రామకృష్ణ మాట్లాడుతూ.. సంబంధిత కాంట్రాక్టర్‌ హుజూరాబాద్‌ పరిధిలో కాల్వ పనులు చేశారన్నారు. కన్‌స్ట్రక్షన్‌ సివిల్‌ హుజూరాబాద్‌ కిందికి వస్తాయన్నారు. శాఖ రీఆర్గనైజేషన్‌లో హుజూరాబాద్‌ కార్యాలయం సిబ్బంది ఇక్కడి ఎస్‌ఈ కార్యాలయానికి బదిలీ అయ్యారన్నారు. ఆ పనులకు మానుకోటకు సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement