నేడు వినాయక నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

నేడు వినాయక నిమజ్జనం

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా నవరాత్రులు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. కాగా, జిల్లాలో 2,380 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో 1,443 విగ్రహాలను ఇప్పటికే నిమజ్జనం చేశారు. మిగిలిన విగ్రహాల నిమజ్జనానికి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని నిజాం చెరువులో నిమజ్జనానికి సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.

ఇద్దరికే అనుమతి..

నిజాం చెరువులో విగ్రహాల నిమజ్జనానికి ఉత్సవ కమిటీ సభ్యుల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంది. అక్కడ మున్సిపల్‌ సిబ్బంది మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. గతంలో మున్నేరు వాగులో వినాయక నిమజ్జనం చేసే క్రమంలో పలువురు మృతి చెందారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు మున్నేరు వాగులో నిమజ్జనాలు చేయవద్దని వినాయక భక్త మండలి సభ్యులకు సమాచారం అందించారు.

ఏర్పాట్లు చేసిన అధికారులు..

జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్‌ శాఖ, మున్సిపాలిటీ అధికారులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గజఈతగాళ్లు, భారీ క్రేన్లు, ఫైర్‌ వాహనాలు, విద్యు త్‌, వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎలా ంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీ సులు నిరంతరం పర్యవేక్షణ చేస్తారని అధికారులు తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్‌ అధికారులను ఆదేశాలు జారీచేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌ కుమార్‌, డీఎస్పీ తిరుపతిరావు, డీఈ ఉపేందర్‌, తహసీల్దార్‌ రాజేశ్వర్‌ రావు ఏర్పాట్లను పరిశీలించారు.

నిజాం చెరువు వద్ద..

మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని నిజాం చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈమేరకు పాత, కొత్త బజారుల్లో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమలను నిజాం చెరువులో భక్తులు నిమజ్జనం చేయనున్నారు.

కొత్త బజార్‌లో ఏర్పాటు చేసిన గణేశ్‌ విగ్రహాలు మూడుకొట్ల సెంటర్‌, కోర్టు సెంటర్‌ మీదుగా రైల్వే గేటు వైపు నుంచి మదర్‌థెరిస్సా సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఆహ్వాన వేదిక వద్దకు చేరుకుంటాయి. ఈక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం విగ్రహాలను నిజాం చెరువుకు తరలిస్తారు.

మరోవైపు విగ్రహాలను నెహ్రూ సెంటర్‌, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, అండర్‌బ్రిడ్జి నుంచి బంధంచెరువు రోడ్డు, ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా పూలే జంక్షన్‌, వైఎస్సార్‌ సెంటర్‌, మున్సిపల్‌ కార్యాలయం నుంచి మదర్‌థెరిస్సా సెంటర్‌లోని ఆహ్వాన వేదిక వద్దకు తరలిస్తారు. పూజల అనంతరం చేపల మార్కెట్‌, ఆర్టీసీ బస్టాండ్‌ మీదుగా నిజాం చెరువు వరకు శోభాయాత్ర జరుగుతుంది.

జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి

జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు వద్ద ఏర్పాట్లు

200 మంది అధికారులు, సిబ్బంది విధులు

జిల్లాలో 2,380 గణేష్‌ విగ్రహాల ప్రతిష్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement