జిల్లా సమాచారం.. | - | Sakshi
Sakshi News home page

జిల్లా సమాచారం..

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

తొర్రూరు: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి గ్యాస్‌ రీఫిల్‌ బుకింగ్‌పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో వినియోగదారులు పొదుపుగా గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ఒక సిలిండర్‌ బుక్‌ చేసిన తర్వాత మరొకదాని కోసం పట్టణ ప్రాంతాల వారు 35 రోజులు, గ్రామీణ ప్రాంతాల వారు 45రోజుల అనంతరం బుకింగ్‌ చేసుకోవడానికి పరిమితి విధించారు. అయితే తాజాగా, కేంద్రం 25 రోజులకే గ్యాస్‌ బుకింగ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇబ్బందులు పడ్డ వినియోగదారులు..

సాధారణంగా 30–35 రోజులకు ఒకసారి ఖాళీ అయ్యే సిలిండర్‌ను 45–50 రోజుల వరకు పొదుపుగా వాడుకున్నారు. చాలా మంది కట్టెలు, ఎలక్ట్రిక్‌ పొయ్యిలను వినియోగించి గ్యాస్‌ను ఆదా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలు స్థానికంగా వంట చెరుకును సేకరించి కట్టెల పొయ్యిపైనే వంటలు చేసుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. అయితే తాజాగా, కేంద్రం ఆంక్షలు సడలించడంతో మళ్లీ 25రోజుల వ్యవధిలోనే సిలిండర్‌ బుక్‌ చేసుకోవడానికి అవకాశం రావడంతో వినియోగదారులకు ఊరట లభించినట్లయింది. అలాగే కొత్త గ్యాస్‌ కనెక్షన్లను జారీ చేస్తే వేలాది మంది వినియోగదారులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇస్తుందోనని చాలా మంది ఎదురు చూస్తుండడం గమనార్హం.

గ్యాస్‌ కంపెనీలు 3

ఏజెన్సీలు 11

వినియోగదారులు

1,21,131

ఇక 25 రోజులకే బుకింగ్‌

45 రోజుల బుకింగ్‌ పరిమితి మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement