మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సేవలు అంతంతే | - | Sakshi
Sakshi News home page

మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సేవలు అంతంతే

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

జిల్లా ఆస్పత్రిలోని ఎస్‌ఎంసీ వార్డు

సాక్షి, మహబూబాబాద్‌: ప్రభుత్వం మాతా, శిశు సంక్షరణకు ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. తల్లిగర్భంలో శిశువు ఉన్నప్పటి నుంచి ప్రసూతి, తర్వాత పెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందిస్తోంది. ఈమేరకు జిల్లా కేంద్రంలో మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే గతంతో పోలిస్తే సేవలు రోజురోజుకూ తగ్గుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

నిధులకు లేక నీరసం..

మాతాశిశు సంరక్షణ కేంద్రం అనేది ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో భాగమైనా.. అది నేషనల్‌ హెల్త్‌మిషన్‌ పరిధిలో ఉంటుంది. అయితే సెంటర్‌ నిర్వహణ, మందులు, పరికరాలు, సిరంజీలు, ఇతర మరమ్మతులకు నిధులు ఎన్‌హెచ్‌ఎం నుంచి రావాల్సి ఉంది. కానీ, గత కొన్ని నెలలుగా నిధులు రావడం లేదని తెలిసింది. దీంతో అక్కడికి కావాల్సిన మందులు, ఇతర వస్తువులను జనరల్‌ ఆస్పత్రి నిధుల ద్వారా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇవి సరిపడా లేకపోవడంతో పిల్లలకు సరైన వైద్య సేవలు అందడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

డాక్టర్ల పర్యవేక్షణ అంతంతే..

శిశుసంరక్షణ కేంద్రంలో గతంలో పనిచేసిన డాక్టర్లల్లో కొంత మంది బదిలీపై వెళ్లారు. మరికొంతమంది రెగ్యులర్‌ ఉద్యోగం రావడంతో వెళ్లారు. అయితే బదిలీపై ఇక్కడికి వచ్చిన ఇన్‌చార్జ్‌ సక్రమంగా డ్యూటీకీ రాకపోవడం, సమయపాలన పాటించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఆయన పర్యవేక్షణ లేకపోవడంతో మిగిలిన డాక్టర్లు కూడా అంతంత మాత్రంగానే సెంటర్‌కు రావడం, కొందరు మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది మధ్య అంతర్గత తగాదాలు, పెద్దరికం కోసం పంచాయితీలు తరచూ జరుగుతున్నట్లు తెలిసింది. వెరసి ఈ ప్రభావం సెంటర్‌పై పడుతోంది.

ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నాం

మాతా, శిశుసంరక్షణ యూనిట్‌పై ప్రత్యేక శ్రద్ధపెడుతున్నాం. మరమ్మతులు, పరికరాల కొనుగోలు ఎప్పటికప్పుడు చేస్తున్నాం. అక్కడ పనిచేసే డాక్టర్లల్లో ఇద్దరు వెళ్లిపోయారు. ఉన్నవారితోనే సెంటర్‌ నిర్వహిస్తున్నాం. కొత్త డాక్టర్ల నియామకం కోసం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతానికి ఎస్‌ఎంసీలో ఎటువంటి ఇబ్బందులు లేవు.

– శ్రీనివాసరావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

గ్యాస్‌ వినియోగదారులకు ఊరట

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రి, ఎస్‌ఎంసీల పరిధిలోని పిల్లలకు సేవలు అందించేందుకు మొత్తం 50 పడకల యూనిట్‌ ఉంటుంది. అయితే ఇందులో అత్యవసర చికిత్స, పరిపక్వత చెందని పిల్లలు, కామెర్లు అయిన పిల్లల కోసం ఫొటోతెరపి సెంటర్లు ఉన్నాయి. ఇందులో గతంలో భవనం పైకప్పు కూలిపోయి తృటిలో ప్రమాదం తప్పింది. అప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయితే సెంటర్‌లో ఏసీలు, ఇతర మరమ్మతులు చేయలేదు. అదే విధంగా సెంటర్‌లోని కొందరు ఉద్యోగులు పిల్లలను ప్రైవేట్‌ ఆస్పత్రికి పంపించేందుకు తల్లిదండ్రులను బలవంతం చేయడంతో ఇక్కడ పిల్లలు సక్రమంగా ఉండడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితులో అత్యవసర చికిత్స మినహా మిగిలిన వార్డుల్లో ఒక్కరిద్దరు పిల్లలు ఉండడం లేదు.

పని చేయని ఏసీలతో ఇబ్బందులు

వేధిస్తున్న నిధుల కొరత

కొరవడిన డాక్టర్ల పర్యవేక్షణ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగ్గుతున్న సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement