కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని టీహబ్,హైదరాబాద్‌లోని టీహబ్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా అతిపెద్ద హాకథాన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలోనే కెహబ్‌లో హాక్‌థాన్‌ను ప్రారంభించేందుకు అధికారులు కసర్తు చేస్తున్నారు. ఈమేరకు సోమవారం కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రూసా నోడల్ అధికారి ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్‌రెడితో కలిసి హైదరాబాద్‌లో టీ హబ్ సీఈఓ కవిక్రుత్‌ను కలిశారు. తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలను భాగస్వామ్యం చేయడం, విద్యార్థులు, యువత, సాంకేతిక నిపుణులకు విస్తృత అవకాశాలు కల్పించడం తదితర అంశాలను చర్చించారు. కాకతీయ యూనివర్సిటీలోని కేహబ్‌లో హాక్‌థాన్‌ను ప్రారంభించాక టీహబ్, కేహబ్–టీహబ్‌లోని ప్రతినిధులు కలిసి పది ఉమ్మడి జిల్లాల్లోని డిగ్రీ, ఇంటర్, హైస్కూళ్ల విద్యార్థుల నూతన ఆలోచనలతో ఆవిష్కరణలకు ముందుకు వచ్చేలా కృషి చేయనున్నారు. అందుకు ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


