మహబూబాబాద్: కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి ప్రారంభం కాగానే అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ వినతులు స్వీకరించారు. కాగా, గార్ల మండలం పెద్ద కిష్టాపురం సర్పంచ్ గంగావత్ రాంసింగ్.. గత సర్పంచ్ హయాంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, విచారణ చేయాలని వినతిపత్రం అందజేశారు. కాగా, అదనపు కలెక్టర్ ఆ వినతిని డీపీఓకు అందజేసి, సమస్యపై స్పందించాలని సూచించారు. దీంతో చాలాసార్లు వినతి ఇస్తే డీపీఓకు అందజేస్తున్నా రని, సమస్య పరిష్కారం కావడం లేదని సర్పంచ్ రాంసింగ్ వారితో వాగ్వాదం చేశారు. ఈక్రమంలో కలెక్టరేట్ ఏఓ పవన్ జోక్యం చేసుకోగా.. తాను అదనపు కలెక్టర్‌తో మాట్లాడుతుంటే మధ్యలో నీ జోక్యం ఎందుకు అని ఏఓతో సర్పంచ్ తీవ్ర వాగ్వాదం చేశారు. దీంతో పోలీసులు రాంసింగ్‌ను బలవంతంగా బయటికి పంపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాంసింగ్ మాట్లాడుతూ.. గత సర్పంచ్ కాలంలో రూ.8,82,000 నిధులు దుర్వినియోగమైనట్లు నిర్ధారణకావడంతో కార్యదర్శిని సస్పెండ్ చేశారన్నారు. కానీ, ఇంత వరకు ఆ నిధుల రికవరీ లేకపోవడంతో ఎంకై ్వరీ రిపోర్ట్ ఇవ్వడం లేదని, జాప్యం చేస్తున్నారన్నారు. కిందిస్థాయి అఽధికారుల వద్ద న్యాయం జరగకపోతేనే కలెక్టరేట్ ప్రజావాణికి వస్తే ఇక్కడ కూడా న్యాయం జరగడం లేదన్నారు. వినతులపై కలెక్టర్ సీరియస్‌గా తీసుకుంటే ప్రజావాణికి న్యాయం జరుగుతుందని ఆయన వేడుకున్నారు.
అదనపు కలెక్టర్‌తో వాగ్వాదం చేసిన సర్పంచ్
ఆయనను బయటికి పంపిన పోలీసులు


