టీపీ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఆందోళన చేసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా టీపీ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ మైసా శ్రీనివాసులు మాట్లాడుతూ.. మానుకోట మున్సిపాలిటీలోని 13,17,20వ వార్డుల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాల నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. పత్తిపాక పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని అద్దె భవనంలో కొనసాగుతుందన్నారు. అద్దె భవనంలో కనీస సౌకర్యాలు లేక 55 మంది విద్యార్థులు ఇబ్బందులు పడతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


