● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ అర్బన్: వినాయక చవితి సందర్భంగా గణపతి మండపాల వద్ద డీజేలు మార్మోగుతున్నాయి. కాగా, ‘డీజేలతో ప్రాణాలకు ముప్పు’ అనే శీర్షిక సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనంపై ఎస్పీ శబరీష్ స్పందించారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23న జిల్లా వ్యాప్తంగా జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు, ఊరేగింపుల్లో డీజేలు వాడొద్దని హెచ్చరించారు. ఇటీవల డీజే శబ్దాలతో చాలామంది మృతి చెందారని, అలాంటి సంఘటనలు మన జిల్లాలో జరగవద్దన్నారు. భక్తులు, యువకులు ఎలాంటి డీజే ఏర్పాట్లు చేయవద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


