● కలెక్టర్ స్నేహశబరీష్
కొత్తగూడ: ప్రజాసేవలో జాప్యం సహించేది లేదని కలెక్టర్ స్నేహ శబరీష్ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పలు దరఖాస్తులను ఆమె పరిశీ లించి, ఇన్ని దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని తహసీల్దార్ రాజును ప్రశ్నించారు. గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యారు. ఉపాధ్యాయులు ఇంగ్లిష్ భాషపై పట్టు పెంచుకోవాలని సూచించారు. డిజిటల్ బోధన, ఇతర అంశాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల పనితీరుపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఎంఈఓ లక్ష్మీనారాయణను ఆదేశించారు. అనంతరం బూరుగుగుంపు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పౌష్టికాహార వారోత్సవాలను పరిశీలించారు. ఇన్‌చార్జ్ డీఈఓ శ్రీరాములు, డీడబ్ల్యూఓ శిరీష, ఎంపీడీఓ అనురాధ తదితరులు పాల్గొన్నారు.


