● ఇన్‌చార్జ్ డీఈఓ ముందల శ్రీరాములు
కురవి: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించి, నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఇన్‌చార్జ్ డీఈఓ మందుల శ్రీరాములు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని హైస్కూల్‌లో కురవి కాంప్లెక్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి అభ్యసన స్థాయిని నిరంతరం పరిశీలించాలని సూచించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు తప్పనిసరిగా అలవడేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ఏఎక్స్‌ఎల్ కార్యక్రమంలో విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే విధంగా తరగతి గది బోధన చేపట్టాలన్నారు. విద్యార్థుల నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు వినూత్న రీతిలో బోధన పద్ధతులు వినినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీధర్, సీఎంఓ సురేష్, ఆర్‌పీ శ్యామ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


