మహబూబాబాద్ రూరల్: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రికవరీ చేయడంలో జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సేవలను సమర్థవంతంగా వినియోగిస్తూ ఇప్పటివరకు జిల్లా పరిధిలో 2,027 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఎస్పీ శబరీష్ మార్గదర్శకత్వంలో తాజాగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో 77 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో బాధితులకు ఎస్పీ శబరీష్ అందజేశారు. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, సీసీఎస్ సీఐ హతీరాం, ఐటీ సెల్ ఎస్సై జీవీ.కృష్ణారెడ్డి, పీసీ సుమన్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, సీఈఐఆర్ ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారు.
77 ఫోన్లు బాధితులకు అందజేత


