తొర్రూరు: విద్యార్థుల ఉన్నత చదువులకు ఎస్‌బీఐ ఫౌండేషన్ ఆర్థిక సహకారం అందిస్తోంది. విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రూ.100 కోట్ల సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులతో దేశ వ్యాప్తంగా 25 వేల మందికి పైగా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించనుంది. ఇందుకోసం అర్హులైన విద్యార్థుల నుంచి ‘ఎస్‌బీఐ ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్–2026’ పేరిట దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికై తే ఏటా రూ.15 వేలు అందించనున్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలో చదువుతున్న విద్యార్థులందరూ వినియోగించుకోవచ్చని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.
జత చేయాల్సినవి ఇవే..
అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయిన తర్వాత ఆశా స్కాలర్‌షిప్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని వివరాలు పొందుపర్చాలి. గతేడాది చదివిన తరగతికి సంబంధించి 75 శాతం సాధించిన మార్కుల జాబితా, ఆదాయ, కుల, ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, తల్లి లేదా తండ్రి బ్యాంకు అకౌంట్ వివరాలు, విద్యాసంస్థ నుంచి బోనఫైడ్, ఫొటో స్కాన్ చేసి నమోదు చేయాలి. ఈ ప్రక్రియ ముగిశాక ఫౌండేషన్ ప్రతినిధులు దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా రూపొందిస్తారు. అనంతరం అభ్యర్థులతో ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితాను ఎంపిక చేస్తారు. ఎంపికై న వారికి ఏటా వారి అకౌంట్‌లో ఉపకార వేతనాలు జమ చేస్తారు.
అర్హులైన విద్యార్థులకు
ఉపకార వేతనాలు
ఎస్‌బీఐ పీజేఏఎస్–2026 పేరిటదరఖాస్తుల ఆహ్వానం
9 నుంచి 12 తరగతుల విద్యార్థులు అర్హులు
ఎంపికై తే ఏటా రూ.15 వేల సాయం
సెప్టెంబర్ 4 వరకు దరఖాస్తుకు
అవకాశం


