కురవి: చట్టాల గురించి తెలుసుకోవడం అందరి బాధ్యత అని, ఉచిత న్యాయ సేవలను సద్విని యోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాది, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ వి.రాజ్‌కృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వారంతపు సంత ఆవరణలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చట్టాలను తెలుసుకోవడం, హక్కులను కాపాడుకోవడం ప్రతీ పౌరుడి కర్తవ్యం అన్నా రు. చట్టం ముందు అందరూ సమానులేనని, కులం, మతం, లింగం, ప్రాంతం ఆధారంగా ఎవరిపై వివక్ష చూపకూడదన్నారు. 14 ఏళ్ల లోపు పిల్లలతో వెట్టిచాకిరీ చేయించడం చట్టరీత్యా నేరం అన్నారు. బాల్య వివాహాల వంటి దురాచారాలకు పాల్పడి తమ పిల్లల జీవితాలను నాశనం చేయవద్దని సూచించారు. 18 ఏళ్లలోపు పిల్లలను ఎవరైనా లైంగికంగా వేధిస్తే పోక్సో చట్టం కఠినంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు. న్యాయపరమైన సలహాలు, సూచనల కోసం టోల్‌ప్రీ 15100కు ఫోన్ చేసి న్యాయ సలహాలు పొందవచ్చని తెలిపారు.


