మిర్చి ధర రూ.20,410
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు గన్నీ బ్యాగుల సమస్య
బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలి
మహబూబాబాద్ రూరల్ : ఓటరు సవరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా పాల్గొనేందుకు ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో ఏజెంట్లను నియమించాలని టీపీసీసీ జిల్లా కోఆర్డినేటర్ ఎండి.అవేజ్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. బీఎల్‌ఏల నియామక సన్నాహక సమావేశం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ప్రత్యేక ఓటరు సవరణకు సంబంధిత ఫారాలు, ప్రోఫార్మాల ప్రకారం బూత్ లెవెల్ ఏజెంట్లు విధులు నిర్వర్తించాలని సూచించారు.
బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి
మహబూబాబాద్ రూరల్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం వల్ల భవిష్యత్‌లో నేరాలకు దూరంగా ఉంటారని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ రాజుకృష్ణ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్య జీవితంలో అవసరమయ్యే పలు కీలక చట్టాల గురించి వివరించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల తమ హక్కులను కాపాడుకోగలరని తెలిపారు. బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధక చట్టం, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన చర్యలు, మాదక ద్రవ్యాలకు వ్యసనపరులు కావడంవల్ల కలిగే అనర్థాలు వివరించారు. పేదలు, అణగారిన వర్గాల కోసం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలు, టోల్ ఫ్రీ నంబర్ల గురించి ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.వెంకన్న, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
పూలే ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా మల్లేశ్వర్
కేయూ క్యాంపస్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగని మల్లేశ్వర్ నియమితులయ్యారు. కమిటీలో 15మంది కన్వీనర్లు ఉండగా అందులో కేయూ నుంచి మల్లేశ్వర్ ఒకరు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మల్లేశ్వర్ పూలే ఆశయ సాధన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీవాదంతో ముందుకెళ్తున్నారు.
నేడు, రేపు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నేడు, రేపు(11,12 తేదీల్లో) 11వ తెలంగాణ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 552మంది క్రీడాకారులు, 28 మంది టెక్నికల్ అఫిషియల్స్, 20 మంది వలంటీర్లు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరగనున్న ఫెడరేషన్ కప్ జూనియర్, సీనియర్ జాతీయయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
అంతర్‌జిల్లాల ఓపెన్ టు ఆల్
టెన్నీస్ పోటీలు..
వరంగల్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్ వేదికగా శని, ఆదివారాల్లో తెలంగాణ అంతర్ జిల్లాల స్థాయి ఓపెన్ టు ఆల్ టెన్నిస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ జయసింహరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోటీలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ హాజరై ప్రారంభిస్తారని తెలిపారు.
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం మిర్చి క్వింటా ధర రూ.20,410 పలికింది. వ్యాపారులు 940 క్వింటాళ్ల (2,687 బస్తాలు) మిర్చిని కొనుగోలు చేశారు. మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.20,410, మోడల్ ధర రూ.19,010, మినిమం ధర రూ.15,010 పలికినట్లు అధికారులు తెలిపారు.
– మహబూబాబాద్ రూరల్
పంచాయితీ
సాక్షి, మహబూబాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రధానమైన గన్నీ బ్యాగుల సమస్య మాత్రం యాసంగి ధాన్యం కొనుగోలుకు ఆటంకంగా మారే అవకాశం ఉంది. గతంలో సగం కొత్తవి, సగం పాతవి దిగుమతి చేసుకునే వీలు ఉండేది. కానీ, ఇప్పుడు వివిధ కారణాలతో బ్యాగుల సరఫరాలో కొరత ఏర్పడే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు మిల్లర్ల వద్ద నుంచి పాత సంచులు సేకరించే పనిలో ఉన్నారు. అయితే నాలుగైదు సంవత్సరాల నుంచి పాత బ్యాగులు తిరిగి ఇవ్వలేదని, ఇప్పుడు ఒకేసారి ఇవ్వమంటే ఎలా అని మిల్లర్లు అంటున్నారు.
65లక్షల గన్నీ బ్యాగులు అవసరం..
యాసంగిలో 1,71,780 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందుకుగాను రైతుల అవసరాలు, ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు పోగా 2,60,762 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు అంచనాలు వేశారు. ఈ లెక్క ప్రకారం 65,19,076 గన్నీ బ్యాగులు అవసరం. అయితే ఇందులో 35,20,301 గన్నీ బ్యాగులు కొత్తవి, 29,98,775 గన్నీలు పాతవి అవసరం ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 5లక్షల గన్నీ బ్యాగులు పాతవి, 4,10,000 కొత్తవి అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 31,10,301 కొత్తవి, 24,98.775 గన్నీలు పాతవి.. మొత్తంగా 56,09,076 గన్నీలు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
పాత గన్నీలు ఇవ్వండి..
ధాన్యం సేకరణ కోసం పాత గన్నీ సంచులు తప్పనిసరిగా ఇవ్వాలని జిల్లా అధికారులు మిల్లర్లను ఆదేశించారు. 2016 నుంచి ఇప్పటి వరకు పాత గన్నీలు తిరిగి ఇవ్వలేదని మొత్తం కలిపి మిల్లర్లదందరూ 10లక్షల గన్నీ బ్యాగులు ఇస్తే కానీ యాసంగి సీజన్‌కు సరిపోవని వివరించారు. అయితే, ఇప్పటికే మొతాదుకు మించి ధాన్యం రావడం, సీఎంఆర్ ఒక వైపు.. ధాన్యం దిగుమతి మరోవైపు చేస్తున్నామని దీంతో సంవత్సరాల తరబడి గన్నీలు పక్కన వేయడంతో ఎలుకలు కొట్టడం, చెదలు పట్టిపోవడంతో పాత గన్నీలు లేకుండా పోయాయని మిల్లర్లు చెప్పినట్లు సమాచారం. అయితే బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, హరియాణా నుంచి కొత్త గన్నీలు రావడంలో జాప్యం అవుతుందని, పాత గన్నీలు ఇవ్వకపోతే కొనుగోళ్లు ఇబ్బంది అవుతుందని మిల్లర్లకు సర్దిచెప్పినట్లు తెలిసింది. దీంతో సంవత్సరాల తరబడి మూలకు వేసిన గన్నీలు ఇవ్వడం కుదరదు.. కానీ కనీసం అన్ని మిల్లులు కలిపి గత మూడు సీజన్లకు చెందిన గన్నీలు కలిపి 3లక్షల మేరకు తిరిగి ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ పరిస్థితిలో కొనుగోళ్లు ప్రారంభిస్తే గన్నీల కొరత ఉంటుందా.. అప్పటి వరకు కొత్త గన్నీలు వస్తాయా.. అనేది చర్చగా మారింది.
అంబేడ్కర్ జయంతిని పండుగలా జరుపుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఈ నెల 14న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను పండుగలా జరుపుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కె. శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు సెంటర్‌లో ఈనెల 14న ఉదయం 9 గంటలకు అంబేడ్కర్ విగ్రహానికి నివా ళులర్పించి, కలెక్టరేట్ కార్యాలయంలో ఉత్సవ స మావేశం నిర్వహిస్తామన్నారు. దళిత, గిరిజన, వె నుకబడిన తరగతుల, మైనార్టీ సంక్షేమ శాఖ అధి కారులతో పాటుఇతర శాఖల అధికారులు, ప్రజా, కుల సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు.
గ్యాస్ పోయి..
చిట్టు(ఊక) పొయ్యి వచ్చే
కొత్తగూడ: గ్యాస్ సిలిండర్ల కొరత చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే, చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, టీ షాపుల నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాధి కోల్పోకుండా నిలదొక్కుకుంటున్నారు. మండల కేంద్రంలోని ఓ టిఫిన్ సెంటర్ యజమాని వినూత్నంగా చిట్టు(ఊక) పొయ్యి ద్వారా టిఫిన్లు తయారు చేస్తున్నాడు. ఈపొయ్యి ద్వారా ఒకటి రెండు కట్టెలతో ఎక్కువ సమయం మంట వచ్చి పలు రకాల టిఫిన్లు తయారు చేయగలుగుతున్నాడు.
పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ నుంచి తక్కువ సరఫరా
పాత సంచులు ఇవ్వాలని
ఆదేశించిన అధికారులు
ఇవ్వలేమని అంటున్న మిల్లర్లు


