● కలెక్టర్ స్నేహ శబరీష్
నెహ్రూసెంటర్: ఆయుర్వేదం, హోమియోపతి, యునాని సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్నేహశ బరీష్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీజీహెచ్‌లో శుక్రవారం ఆయుష్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు తదితర ప్రాంతాలోల్లో ఔషధ మొక్కలను నాటాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, గురుకులాల్లో యోగా శిక్షణ కార్యక్రమం, గ్రామస్థాయిలో ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతోనే ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. హోమియో వైద్య విధాన స్థాపకులు డాక్టర్ శామ్యూల్ హనిమాన్ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, హోమియో వైద్యులు చైతన్య, రామకృష్ణ, పి.కిరణ్‌కుమార్, వసుంధరదేవి, యునాని వైద్యులు బి.శంకర్, డీపీఎం శ్రవణ్ కుమార్, ఇందుమతి, పద్మ, అశోక్, సంజయ్, మోహన్ పాల్గొన్నారు.


