● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి వెంటనే వైద్య చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవిరాథోడ్ అన్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్రీయ బాల స్వస్థ్య, జిల్లా ఏర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. పోషకాహార లోపాలు, అభివృద్ధిఆలస్యం, ఇతర వ్యాధులను వెంటనే గుర్తించి ఇంటర్వెన్షన్ సెంటర్‌లో సమగ్ర వైద్య సేవలు, థెరఫీ సేవలు సమయానికి అందించవచ్చన్నారు. ఆర్‌బీఎస్‌కే టీమ్స్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమాల అమలులో పురోగతి, సమీక్షిస్తూ లోపాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో పని చేసి బాలల ఆరోగ్య సూచికలను మె రుగుపర్చాలని తెలిపారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి లక్ష్మీనారాయణ, కొప్పు డెమో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


