
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● డీఈఓ రవీందర్‌రెడ్డి
కురవి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో సీరోలు, కురవి మండలాల టీఎల్‌ఎం మేళా కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాలలో టీఎల్‌ఎంను ఉపయోగిస్తూ బోధన చేయాలని సూచించారు. పిల్లలను ప్రభుత్వ బడిలోకి పంపించాలన్నారు. సీరోలు నుంచి 10, కురవి నుంచి 10 ఎగ్జిబిట్లు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. ఎంఈఓలు ఇస్లావత్ లచ్చిరాంనాయక్, వాంకుడోత్ బాలాజీ నాయక్, సీఆర్‌పీలు వెంకన్న, ఉమారాణి, నవీన్, బీమా, మానస పాల్గొన్నారు.