
పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం
● రాష్ట్ర డెయిరీ సూపరింటెండెంట్ దేవేందర్
తొర్రూరు రూరల్: పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర డెయిరీ సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు. మండల శివారులోని పాల శీతలీకరణ కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర డెయిరీ అధికారులు సందర్శించారు. పాల సేకరణ, విక్రయాలు, పాడి రైతుల అభివృద్ధి తదితర అంశాలపై తొర్రూ రు డెయిరీ చైర్మన్ రాసాల సమ్మయ్యను అధికారులు అడిగి తెలుసుకున్నారు. తొర్రూరు పాల కేంద్రం భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రహరీ నిర్మి స్తామని, విజయ డెయిరీ పార్లర్ మంజూరు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం చైర్మ న్ సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వరంగల్ డీడీ శ్రావణ్‌కుమార్, రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ సుబ్బారావుతో కలిసి రాష్ట్ర డెయిరీ సూపరింటెండెంట్ మాట్లాడారు. పాడి పశువుల కొనుగోలు, బల్క్ మిల్క్ చిల్లింగ్ కేంద్రాలతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు, పార్లర్లు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామన్నారు. విజయ డెయిరీ పాల ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం ఉందని, దాన్ని నిలబెట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్, మేనేజర్లు సురేష్, వెంకటనారాయణ, ప్రతినిధులు సుధాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చంద్రమౌళి, సతీష్ పాల్గొన్నారు.