వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి | - | Sakshi
Sakshi News home page

వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి

Aug 27 2025 10:01 AM | Updated on Aug 27 2025 10:01 AM

వ్యాధ

వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి

నిట్‌ ఉన్నతిలో భాగస్వాములు కావాలి

మహబూబాబాద్‌: పెంపకందారులు గొర్రెలు, మేకలకు తప్పనిసరిగా పీపీఆర్‌ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య, సంవర్థక శాఖాధికారి కిరణ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 26నుంచి సెప్టెంబర్‌ 10వ తేదీ వరకు టీకాలు వేస్తామన్నారు. జిల్లాలో 6,60,000 గొర్రెలు, మేకలు ఉన్నాయన్నారు. పీపీఆర్‌ అనే వ్యాధి వైరస్‌క్రిమి వల్ల వస్తుందన్నారు. వ్యాధి బారిన పడి న జీవాల్లో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం, ము క్కు నుంచి చీము, నోటి నుంచి సొంగకారడం వంటి వ్యాధి లక్షణాలు ఉంటాయన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం అర్హులైన ప్రభు త్వ పాఠశాలలు, మోడల్‌ స్కూల్‌, కస్తూర్బాగాంధీ విద్యాలయం, ఎయిడెడ్‌ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ప్రతిపాదనలు మండల విద్యాశాఖ అధికారి ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రవీందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు తమ ప్రతిపాదనలు తగిన డాక్యుమెంట్స్‌తో ఈ నెల 29న సాయంత్రం 4గంటలలోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఉపాధ్యాయులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో లేవని, కోర్టు కేసులు లేవని ధ్రువీకరించి ఎంఈఓలు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

డిపో అభివృద్ధికి

కృషి చేయాలి

నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌ డిపో అభివృద్ధికి కృషి చేయాలని కరీంనగర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సోలోమన్‌ సూచించారు. మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపోను మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా డిపోలోని మెయింటనెన్స్‌, సెక్యూరిటీ, గ్యారేజ్‌ విభాగాలను సందర్శించారు. బస్సుల మన్నిక, మెయింటనెన్స్‌ గురించి మెకానిక్‌లకు వివరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ ఎం.శివప్రసాద్‌, సూపరింటెండెంట్‌ శ్రీమన్నారాయణ, ఎంఎఫ్‌ పాపిరెడ్డి, టీఐ శ్రీరాములు, ఏడీసీలు, ఆఫీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

క్షయరహిత జిల్లాగా

తీర్చిదిద్దుదాం

డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌

నెహ్రూసెంటర్‌: మానుకోటను క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు మంగళవారం యూపీహెచ్‌ఎస్‌లో పోషకాహారం అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించేందుకు అందరూ సహకరించాలని కోరారు. క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవడం, మందులు వాడడం ద్వారా టీబీని జయించవచ్చని డీఎంహెచ్‌ఓ తెలిపారు. కార్యక్రమంలో యూపీహెచ్‌సీ డాక్టర్‌ మౌనిక, ప్రోగ్రాం అధికారి విజయ్‌కుమార్‌, తోట శ్రీనివాస్‌, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మైస నాగయ్య, సోమ య్య, వెంకటయ్య, జనార్దన్‌, రమణయ్య, నారాయణ, అరుణకుమారి, వెంకట్‌రెడ్డి, రత్నామాచారి, ప్రవీన్‌కుమార్‌, వైద్య సిబ్బంది, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.

నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ను అన్ని రంగాల్లో అగ్రభాగంలో నిలుపుతూ, ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను నిలిపే భాగస్వాములుగా నూతన విద్యార్థులు నిలవాలని నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ తెలిపారు. నిట్‌లో ప్రవేశం పొందిన యూజీ 1,245 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నిట్‌ వరంగల్‌ ఆడిటోరియంలో మంగళవారం ఓరియంటేషన్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ ముఖ్య అతిథిగా పాల్గొని ‘సాంకేతిక విద్యకు మణిహారంగా నిలుస్తున్న నిట్‌ వరంగల్‌కు స్వాగతం’ అంటూ విద్యార్థులను ఆహ్వానించారు. విద్యతోపాటు మానవీయ విలువలను పెంపొందించుకుని సమాజంలో ఉత్తమ పౌరులుగా రాణించాలని అన్నారు.

వ్యాధి నిరోధక  టీకాలు వేయించాలి1
1/1

వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement