
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
మరిపెడ రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్టేజితండా గ్రామపంచాయతీ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. స్టేజితండా గ్రామపంచాయతీ పరిధిలోని మేగ్యాతండాకు చెందిన భూక్య వెంకన్న (35) ఆటో నడుపుకుంటూ జీవ నం సాగిస్తున్నాడు. వెంకన్నకు పదేళ్ల క్రి తం రజితతో వివా హం కాగా, వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లింది. స్టేజితండా పరిధిలోని ఓ వెంచర్‌లో ఆటో నిలిచి ఉండగా గురువారం తెల్లవారుజామున స్థానికులు గమనించి ఆటోలో ఉన్న వెంకన్నను లేపగా ఉలుకుపలుకు లేదు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా నా కొడుకు వెంకన్నను కోడలు ర జితతో పాటు మరో వ్యక్తి కావాలనే చంపారని, వా రిపై చర్య తీసుకోవాలని ఆరోపిస్తూ మృతుడి తండ్రి హచ్చు మరిపెడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.