
సత్తాచాటిన ఆదివాసీ యువకుడు
● అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం
వాజేడు: అవకాశం కల్పిస్తే దేశానికి పేరు ప్రఖా ్యతలు సాధించి పెడతామని నిరూపించాడు ఏ జెన్సీలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మొడెం వంశీ అనే యువకుడు. ఈ నెల 24న ఉత్తర అమెరికాలోని కోస్టారికాలో ని ర్వహించిన అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ 68 కేజీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. వివరాలిలా ఉ న్నాయి.. ములుగు జిల్లా వాజేడు మండల పరిఽ దిలోని ఇప్పగూడెం మారుమూల గ్రామానికి చెందిన మొడెం మోహన్‌రావు, లక్ష్మిల కుమారుడు వంశీ 10వ తరగతి వరకు చదివాడు. మొదటి నుంచి పవర్ లిఫ్టింగ్‌పై మక్కువ చూపేవాడు. దీంతో అతని ప్రతిభను గుర్తించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసొసియేషన్ వారు వంశీని ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో జాతీయ స్థాయిలో గెలుపొంది అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యా డు. దాతల ఆర్థికసాయంతో అమెరికాలో జరిగి న పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచా డు. ఆర్థికసాయం చేసి సహకరించిన ప్రతిఒక్కరీకి వంశీ కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ ఉత్తమ బోధన
ఉపాధ్యాయురాలిగా స్నేహలత
హన్మకొండ: జాతీయ ఉత్తమ బోధన ఉపాధ్యాయురాలు–2025 అవార్డుకు నక్క స్నేహలత యాదవ్ ఎంపికయ్యారు. హనుమకొండ గాంధీనగర్ (గోకుల్‌నగర్)కు చెందిన స్నేహలత హైదరాబాద్ కొండాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్‌స్ట్రక్షన్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఆమె 2007 నుంచి సీనియర్ ఇన్స్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగ రీత్యా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. సర్టిఫికెట్ కోర్సు అండ్ ప్లేస్‌మెంట్ వంటి వృత్తి విద్యా కోర్సులను అందిస్తూ వారికి ఉత్తమ విద్యాబోధన చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ తెలంగాణ నుంచి నక్క స్నేహలతను ఉత్తమ బోధన ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న న్యూ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నక్క స్నేహలత అవార్డు అందుకోనున్నారు.

సత్తాచాటిన ఆదివాసీ యువకుడు