
పర్యావరణ పోటీల్లో జనగామ ఫస్ట్
జనగామ: జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటేషన్–2025లో తెలంగాణకు గర్వకారణంగా జనగామ జిల్లా దేశంలో మొదటి స్థానాన్ని కై వసం చేసుకుంది. మొత్తం 75,156 రిజిస్ట్రేషన్ నమోదు కావడం రాష్ట్రానికే కాక దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ మే రకు కలెక్టర్ రిజ్వాన్ బాషా గురువారం సంతోషం వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు.
పోటీలు ఇలా..
జాతీయ పర్యావరణ పోటీలను మూడు దశల్లో జూలై 1వ తేదీన ప్రారంభించారు. పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, భాష వివరాలను రాసి, పర్యావరణ ఫొటోలతో అప్‌లోడ్ చేయాలి. విద్యార్థి తరగతి ని బట్టి, ఇతరులకు వృత్తి ఆధారంగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం క్విజ్ దశ ప్రారంభించి నీటి పొదుపు, మొక్కల నాటకం, చెత్త వేరు చేయడం వంటి అంశాలకు సంబంధించి 20 ప్రశ్నలకు జవాబుతో ముగుస్తుంది. ప్రశ్నలకు జవాబు చెప్పిన ఆధారంగా మార్కులను కేటాయించి, ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. విద్యార్థులతో పాటు ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, అన్ని వర్గాల ప్రజలకు పాల్గొనే అవకాశం కల్పించడంతో జనగామ జిల్లా మొదటి నుంచే దేశంలో రెండో స్థానంలో నిలిచి, ఆగస్టు 18న మొదటి స్థానాన్ని చేరుకుంది. అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాతో గట్టి పోటీ నడిపి 10 వేల స్కోర్ మెజార్టీతో దేశంలోనే అగ్రస్థానం దక్కించుకుంది.
అందరి భాగస్వామ్యంతోనే సాధ్యం
– కలెక్టర్ రిజ్వాన్ బాషా
భౌగోళిక పరిమితులు, వనరుల కొరత ఉన్నప్పటికీ, మన జిల్లా–మన నీరు కార్యక్రమం, ఇంకుడుగుంతల నిర్మాణం, వనమహోత్సవంలో మొక్కల నాటకం వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంతో ఈ పో టీల్లో అత్యధిక భాగస్వామ్యం సాధ్యమైందని కలెక్ట ర్ రిజ్వాన్ తెలిపారు. వినాయక చవితి సందర్భంగా మరింత ఉత్సాహం నెలకొందన్నారు. ఆగస్టు 26వ తేదీ రాత్రి వరకు 10 వేల స్కోర్ ఆధిక్యాన్ని కొనసాగించిన జిల్లా, కలెక్టర్ పిలుపుతో వినాయక చవితి రోజు వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ స భ్యులు మట్టి గణపతి ఫొటోలు అప్‌లోడ్ చేసి రిజి స్ట్రేషన్లు పూర్తి చేయడంతో జాతీయ స్థాయిలో తె లంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసిందన్నా రు. ఈ విజయానికి తోడ్పడిన హరితదళ ప్రాజెక్ట్ అ ధికారి గౌసియా బేగం, ఏఎంఓ శ్రీనివాస్, విద్యా శా ఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, స్వయం సహాయక సభ్యులు, వివిధ శాఖల ఉ ద్యోగులను కలెక్టర్ అభినందించారు.
దేశంలోనే మొదటి స్థానం
సాధించిన జిల్లా
కాంపిటీషన్–2025లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు
75,156 మంది రిజిస్ట్రేషన్

పర్యావరణ పోటీల్లో జనగామ ఫస్ట్