
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
మహబూబాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ క్యాంపు కార్యాలయం నుంచి తహసీల్దార్లు, కమిషనర్లు, సంబంఽధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక బృందాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. చెరువులు, వంతెనలు, వాగులు, లోలెవల్ బ్రిడ్జి తదితర ప్రదేశాల్లో సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
హాజరుశాతం పెంచాలి
విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం విద్యాశాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేయాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్దచెరువు పరిశీలన..
బయ్యారం: మండలంలో గురువారం కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆకస్మికంగా పర్యటించారు. బయ్యారం పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆయన లేబర్‌రూం, వార్డులు, మందుల గది, సిబ్బంది హాజరు, మందులస్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వైద్యాధికారితో మాట్లాడుతూ.. పీహెచ్‌సీ పరిధిలోని సబ్‌సెంటర్లలో షెడ్యూల్‌ప్రకారం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం బయ్యారంలోని బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. తర్వాత బయ్యారం పెద్దచెరువు అలుగులు, ఇల్లెందు–మహబూబాబాద్ రహదారిపై ఉన్న జిన్నెలవర్రె లోలెవల్ కల్వర్ట్‌ను కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మి, వైద్యాధికారి విజయ్, ఎంఈఓ దేవేంద్రాచారి తదితరులు ఉన్నారు.