
చిమ్మ చీకటి.. జోరువాన
● అన్నదాతల
‘కూపన్’ కష్టాలు..
బందోబస్తు మధ్య
యూరియా కూపన్ల పంపిణీ
నర్సింహులపేట: మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఆదివారం ఉదయం నుంచి ఎస్సై మాలోతు సురేష్, సిబ్బంది పర్యవేక్షణలో అధికారులు రైతులకు యూరియా కూపన్లు అందజేశారు. యూరియా రాకున్నా సాయంత్రం వరకు 770 కూపన్లు అందజేశారు. కాగా కూపన్లు అందని సుమారు 800 మంది రైతులు ఏఓ వినయ్‌కుమార్‌ను కార్యాలయం ఎదుట నిలదీశారు. వారం రోజుల నుంచి తిరుగుతున్న కూపన్లు ఇవ్వడం లేదని, కూపన్లు ఇస్తనే ఇంటికి వెళ్తామని రైతులు ఏఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కూపన్లు రాని రైతుల నుంచి పట్టాదారు పాస్‌బుక్కుల జిరాక్స్‌లు తీసుకున్నారు. రెండు రోజుల్లో కూపన్లు అందజేసి యూరియా బస్తాలు ఇస్తామని, అందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఓ అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసిన రైతులు చివరకు కూపన్లు దొరకకపోడంతో నిరాశతో ఇళ్లకు వెళ్లారు. ఎస్సై సురేష్ ఎలాంటి గొడవలు జరగకుండా పర్యవేక్షణ చేశారు.
కేసముద్రం: కేసముద్రం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని రైతు వేదిక వద్ద ఆదివారం రాత్రి యూరియా కూపన్ల కోసం రైతులు జాగరణ చేశారు. నేడు(సోమవారం) రైతు వేదిక వద్ద యూరియా ఇవ్వనుండడంతో అధికారులు మహిళలు, పురుషుల కోసం ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల రైతులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో.. పోలీ సులు వారిని క్యూలో నిలబెట్టారు. వీరితో పాటు మరికొంతమంది రైతులు వస్తుండడంతో ప్రధాన గేటుకు తాళం వేశారు. ఒక వైపు వర్షం పడుతున్నప్పటికీ రైతులు గొడుగులు పట్టుకొని నిల్చు న్నారు. యూరియా కూపన్ల కోసం పడిగాపులు పడ్డారు. కనీసం విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో చీకట్లో రైతులు అవస్థలు పడ్డారు. మరికొందరు మహిళలు, వృద్ధులు దుప్పట్లను వెంట తెచ్చుకుని రైతు వేదిక ముందు నిద్రించారు. చీకట్లో మహిళా రైతులు అవస్థలు పడ్డారు. మొత్తానికి యూరియా టోకెన్ల కోసం అర్ధరాత్రి వరకు నానా అవస్థలు పడ్డారు. సెల్‌ఫోన్‌ల లైట్ల వెలుతురు మధ్య కూర్చున్నారు.

చిమ్మ చీకటి.. జోరువాన

చిమ్మ చీకటి.. జోరువాన

చిమ్మ చీకటి.. జోరువాన