
కొలువుదీరిన గణనాథుడు..
– మరిన్ని ఫొటోలు 9లోu
కోతుల బెడదతో గణపయ్యకు ఇల్లు
గార్లలో గణనాథుడి సన్నిధిలో భక్తులు
మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా బుధవారం వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ సెట్లు వేసి గణనాథులను ప్రతిష్ఠించారు. జిల్లా కేంద్రంలో శ్రీమహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గోమయ గణపతిని కొలువుదీర్చారు. అదేవిధంగా పలు చోట్ల మట్టిగణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు. విఘ్నేశ్వరుడు తమను ఆశీర్వదించాలని భక్తులు వేడుకున్నారు. ఇదిలా ఉండగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత పోలీసు బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో గణపయ్యకు భక్తులు ఇల్లు నిర్మించి పూజలు ప్రారంభించారు. గణపయ్యకు ఇల్లు నిర్మించటం ఏమిటీ అనుకుంటున్నారా.. గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉంది. లడ్డూ, ప్రసాదాలు, ఇతర సామగ్రి రక్షణ కోసం వేప చెక్క బెండ్లతో చిన్న ఇల్లు మాదిరిగా నిర్మించి అందులో గణపతిని కొలువుదీర్చి పూజిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమ గణపతికి కోతుల తాకిడి ఉండదని భక్తులు పేర్కొన్నారు. – మహబూబాబాద్ రూరల్

కొలువుదీరిన గణనాథుడు..

కొలువుదీరిన గణనాథుడు..