
‘సమయపాలన పాటించని అధికారులు’
చిన్నగూడూరు: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం అధికా రులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. గురువారం ఉద యం 11.05 గంటల వరకు ఎంపీడీఓ కిన్నెర యాకయ్య మినహా అధికారులు, సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈవిషయమై ఎంపీడీఓను ‘సాక్షి’ వివరణ కోరగా దూర ప్రాంతాల్లోని పట్టణాల్లో నివాసం ఉంటూ రైళ్లు, బస్సుల ద్వారా ఆలస్యంగా వస్తున్నారని తెలిపారు. సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, అధికారులు, సిబ్బంది ఆలస్యంగా రావడం వల్ల తమ పనులు సకాలంలో పూర్తి కావడంలేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.