
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
మహబూబాబాద్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ కోసం మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్టించుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, గ్రౌండ్ వాటర్ డీడీ సురేష్, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సైంటిస్టు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన చెందవద్దు
కురవి: రైతులు ఆందోళన చెందవద్దని, యూరియా వస్తుందని అడిషనల్ కలెక్టర్ కె.అనిల్‌కుమార్ అన్నారు. సోమవారం యూరియా పరిస్థితిపై తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 756.495 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, గత ఏడాదితో పోలిస్తే 101.105 మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. యూరియా వస్తుందని, రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి నరసింహస్వామి, తహసీల్దార్ విజయ, ఏఓ నరసింహరావు, డీపీఆర్‌ఓ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
కొరత తీరుస్తాం
గార్ల: జిల్లాలో త్వరలో యూరియా కొరత తీరుస్తామని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ వెల్లడించారు. సోమవారం గార్లలోని పీఏసీఎస్ కార్యాలయంలోయూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యూలో రైతులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, నీడ పరదాలు వేయించాలని మండల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, తహసీల్దార్ శారద, మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు, ఎస్సై ఎస్‌కె రియాజ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.