ఉమ్మడి జిల్లాకు రెండు సీఓఈ కళాశాలలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాకు రెండు సీఓఈ కళాశాలలు

Aug 24 2025 8:34 AM | Updated on Aug 24 2025 8:34 AM

ఉమ్మడి జిల్లాకు రెండు సీఓఈ కళాశాలలు

ఉమ్మడి జిల్లాకు రెండు సీఓఈ కళాశాలలు

న్యూశాయంపేట : ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్‌) ఆధ్వర్యంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ (సీఓఈ) కళాశాలలు రెండు మంజూరయ్యాయి. ఈ మేరకు టెమ్రిస్‌ సెక్రటరీ షఫియుల్లా ఉత్తర్వులు జారీచేశారు. సీఓఈ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టెమ్రిస్‌ ఉమ్మడి జిల్లా కో–ఆరినేటర్‌ జంగా సతీశ్‌ శనివారం తెలిపారు. ఉమ్మడి జిల్లా మైనారిటీ కేటగిరీకి చెందిన (ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు, జైనులు, సిక్కులు)వారితోపాటు నాన్‌ మైనారిటీ కోటా కింద(ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓసీ) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. బాలికల కోసం ఒకటి(వరంగల్‌(జీ1) కేయూ క్రాస్‌), బాలుర కోసం ఒకటి (వరంగల్‌(బీ1) రంగశాయిపేట జక్కలొద్దిలో సీఓఈలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి ఈనెల 29 వరకు గడువు ఉందన్నారు. మరిన్ని వివరాలకు ములుగురోడ్డు పెద్దమ్మగడ్డ సమీపంలోని మైనారిటీ గురుకులాల ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రాంతీయ సమన్వయాధికారి కార్యాలయం లేదా 7331170866, 7331107367 నంబర్లలో సంప్రదించాలన్నారు.

ఏసీబీ వలలో డోర్నకల్‌ సీఐ, కానిస్టేబుల్‌

డోర్నకల్‌: మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ సీఐ బి.రాజేష్‌ బెల్లం కేసులో నిందితుడినుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐతోపాటు గన్‌మెన్‌ (కానిస్టేబుల్‌) రవిని అదుపులోకి తీసుకుని వరంగల్‌ ఏసీబీ కోర్టుకు తరలించారు. వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి కిరాణంతోపాటు బెల్లం వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గత మే నెలతోపాటు ఈ నెల మొదటి వారంలో సదరు వ్యాపారి బెల్లం తరలిస్తుండగా డోర్నకల్‌ పోలీసులు పట్టుకుని బొలేరోతోపాటు ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు. మొదటి కేసుకు సంబంధించి సీఐ.. నిందితుడికి నోటీసు జారీ చేయలేదు. ఈ నెల మొదటి వారంలో నమోదైన కేసులో నిందితుడు హైకోర్టునుంచి ముందస్తు బెయిల్‌ పొందాడు. సీఐ ఆదేశాల మేరకు గన్‌మెన్‌ రవి సదరు వ్యాపారికి ఫోన్‌ చేసి సీఐ రమ్మంటున్నాడని, రూ.50 వేల లంచం ఇవ్వాలని, లేకుంటే బెల్లం వ్యాపారం చేయనివ్వమని బెదిరించాడు. దీంతో సదరు వ్యాపారి ఈ నెల 21న ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో సీఐపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు శనివారం స్థానిక ఎస్సీ, బీసీ కాలనీలోని సీఐ ఇంటికి వెళ్లిన వ్యాపారి రూ.30 వేల నగదు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌ పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అనంతరం ఇంట్లో తనిఖీలు నిర్వహించి రూ.1,25,050 నగదును సీజ్‌ చేసినట్లు తెలిపారు. సీఐతో పాటు గన్‌మెన్‌ రవిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. కేసు విచారణలో భాగంగా ఫిర్యాదుదారుడి పేరు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐలు ఎల్‌. రాజు, ఎస్‌. రాజు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఈనెల 29వ తేదీ వరకు గడువు

బెల్లం కేసులో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు

సీఐ ఇంట్లో మరో రూ.1.25 లక్షల నగదు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement