తలను 360 డిగ్రీలు సులభంగా తిప్పగల ఏకై క జీవి.. శత్రువును వెనుక నుంచి సైతం | - | Sakshi
Sakshi News home page

తలను 360 డిగ్రీలు సులభంగా తిప్పగల ఏకై క జీవి.. శత్రువును వెనుక నుంచి సైతం

Jun 15 2023 11:24 AM | Updated on Jun 15 2023 11:58 AM

- - Sakshi

ఒకే చెవి ఉన్నప్పటికీ అద్భుతమైన వినికిడి శక్తి కలిగి ఉంటుంది

జనగామ: జిల్లా కేంద్రంలోని ఏకశిల విద్యా కళాశాల ఆవరణలో అరుదైన కీటకం బుధవారం ప్రత్యక్షమైంది. డిస్కవర్‌ మ్యాన్‌ రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఈ కీటకాన్ని గుర్తించారు. వయోలిన్‌ను పోలి ఉన్న ఈ కీటకాన్ని ‘ది వాండరింగ్‌ వయోలిన్‌ మాంటిస్‌’గా పిలుస్తారని ఆయన పేర్కొన్నారు. ఎండిన ఆకు రూపంలో కనిపించే ఈ కీటకం.. సన్నని కర్ర పుల్ల మాదిరి దేహంతో ఉండి పరిసరాల్లో కలిసి పోతోంది.

ఈ కీటకం నేలపై నడుస్తున్న క్రమంలో గాలిలో కదులుతున్న కర్రలా కనిపిస్తోంది. ‘తలను 360 డిగ్రీలు సులభంగా తిప్పగల ఏకై క జీవి.. శత్రువును వెనుక నుంచి కూడా చూడగలదు.. ఒకే చెవి ఉన్నప్పటికీ అద్భుతమైన వినికిడి శక్తి కలిగి ఉంటుంది’ అని రత్నాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మానవ అవాసాల విస్తరణ, పచ్చదనం లోపించడంతో వీటి సంఖ్య తగ్గుతున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement