హోలీ వేళ విషాదం.. | - | Sakshi
Sakshi News home page

హోలీ వేళ విషాదం..

Mar 4 2026 8:25 AM | Updated on Mar 4 2026 8:25 AM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం

నడికూడ: ఆటో బోల్తా పడి డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కౌకొండ శివారులో చోటుచేసుకుంది. దామెర ఎస్సై అశోక్‌ కథనం ప్రకారం.. కమాలాపూర్‌ మండలం అంబాలకు చెందిన బోయిని తిరుపతి(38) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. సోమవారం ఆటో యూనియన్‌ సభ్యులతో కలిసి కంఠాత్మకూర్‌ గ్రామ సమ్మక్క,సారలమ్మ గద్దెల వద్దకు విందుకు వచ్చాడు. తిరిగి ఇంటికెతున్న క్రమంలో కౌకొండ శివారు గుట్టల వద్ద క్లచ్‌ ప్లేట్లు ఫెయిలై ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తిరుపతి అక్కడిక్కకడే మృతి చెందాడు. మృతుడి తల్లి బోయిని జానకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కాటారంలో బైక్‌పై వెళ్తూ యువకుడు..

మల్హర్‌(కాటారం) : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కాటారంలో చోటు చేసుకుంది. కాటారం పోలీసుల కథన ప్రకారం.. మహదేవ్‌పూర్‌ మండలం సూరారం గ్రామానికి చెందిన పొలం రాజేందర్‌ (21) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 1తేదీన రాత్రి బైక్‌ పై ఇంటి నుంచి బయలుదేరాడు. ఈక్రమంలో రాజేందర్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. మంగళవారం తెల్ల వారుజామున కాటారంలోని జెన్‌కో కార్యాలయం ఆవరణలో ఉన్న వాటర్‌ సప్లై సంపులో రాజేందర్‌ మృతదేహం తేలి ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలిలోనే బైక్‌ కూడా లభ్యమైంది. దీంతో బైక్‌ అదుపు తప్పి సంపులో పడిపోయాడా లేదా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సంపులో పడి చనిపోయడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

బొలెరో ఢీకొని సింగరాజుపల్లి టోల్‌గేట్‌ సమీపంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌..

దేవరుప్పుల : ట్రాక్టర్‌, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం జనగామ–సూర్యాపేట రహదారిపై సింగరాజుపల్లి టోల్‌గేట్‌ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్సై ఊర సృజన్‌కుమార్‌ కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గంగాపురం గ్రామానికి చెందిన ధార రాములు(55) ట్రాక్టర్‌పై సింగరాజుపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి వైపు నుంచి సిద్దిపేటకు బియ్యం లోడ్‌తో వస్తున్న బొలెరో అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ రాములుతోపాటు పక్కన కూర్చున్న శోభన్‌బాబు ఎగిరిపడి కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. అలాగే, బొలెరో ఉన్న ఇద్దరికి గాయాలు కావడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో రాములు, శోభన్‌బాబు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో రాములు మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుడు ధార శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బొలెరో డ్రైవర్‌ వడ్లకొండ గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

బైక్‌పై నుంచి పడి పెంబర్తిలో యువకుడు..

జనగామ రూరల్‌ :ౖ బెక్‌పై నుంచి పడి ఓ యువకు డు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని పెంబర్తిలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వేంకటేశ్వరపల్లికి చెందిన అజ్మీరా గణేశ్‌ (22) బైక్‌పై హైదరాబాద్‌ నుంచి భూపాలపల్లికి వెళ్తున్నాడు. ఈక్రమంలో బైక్‌ అదుపు తప్పి బైక్‌ చెట్టుకు ఢీకొనడంతో కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

హోలీ పండుగ వేళ విషాదం నెలకొంది. ఉ మ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ చోట్ల జరి గిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు.హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండలో ఆటో బోల్తా పడి డ్రైవర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారంలో బైక్‌పై వెళ్తూ యువకుడు, జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో సింగరాజు పల్లి టోల్‌ గేట్‌ సమీపంలో బొలెరో.. ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి, ఇదే జిల్లా పెంబర్తిలో బైక్‌పై నుంచి పడి యువకుడు, జనగామ జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్‌పై బొలెరో, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరం చెందారు. ఈ ఘటనతో పండుగ పూట ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement