ఆధునిక శతావధానిగా చేపూరిశ్రీరాం | - | Sakshi
Sakshi News home page

ఆధునిక శతావధానిగా చేపూరిశ్రీరాం

Mar 4 2026 8:25 AM | Updated on Mar 4 2026 8:25 AM

విద్యారణ్యపురి: ఓరుగల్లు శతావధానిగా ఉపాధ్యాయుడు చేపూరి శ్రీరాం చిరస్థాయిగా నిలిచి పోతారని సహృదయ సాహిత్య,సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గిరిజామనోహరబాబు అన్నా రు. మంగళవారం కాకతీయ పద్యవేదిక ఆధ్వర్యంలో హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టిసింగ్‌ ప్రాథమిక పాఠశాలలో చేపూరి శ్రీరాం అభినందన సభ నిర్వహించగా గిరిజామనోహరబాబు మాట్లాడారు. ఆధునిక కాలంలో వరంగల్‌లో శ్రీరాం మొదటి శతావధానికిగా గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్‌ చిర్రరాజు మాట్లాడుతూ కేయూలో ఇటీవల తెలుగు విభాగం ఆధ్వర్యంలో తొలిసారిగా శతావధా నం నిర్వహించడం, ఈ ప్రక్రియలో విజయం సాధించిన చేపూరిశ్రీరాంకు అభినందనలు తెలిపారు. కాకతీయ పద్యవేదిక అధ్యక్షుడు కంది శంకరయ్య మాట్లాడుతూ గణిత ఉపాధ్యాయుడిగా ఉన్న చేపూరిశ్రీరాం శతావధానిగా పేరొందడం గొప్ప విషయమన్నారు. అనంతరం అతిథులు చేపూరిశ్రీరాం, విజయ దంపతులను సన్మానించారు. విశ్రాంత విద్యాశాఖాధికారి నన్నపురాజు పరమేశ్వరరాజు, కాకతీయ పద్యవేదిక కార్యదర్శి అక్కెర కరుణాసాగర్‌ మాట్లాడారు. ఇదిలా ఉండగా ఈ సభలోనే పంథిని పోస్టుమాస్టర్‌ తిరుక్కోవళూరు శ్రీహర్ష అష్టావధానం చేసి సభికులను అలరించారు. కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

బ్యారేజీ వద్ద అక్రమ

తవ్వకాలు అవాస్తవం

సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు

అన్నారం బ్యారేజీ ఈఈ రమేశ్‌ బాబు

కాళేశ్వరం: అన్నారం బ్యారే జీ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో వి స్తృత ప్రచారం చేస్తున్నారని, ఇది అవాస్తవమని అన్నారం బ్యారేజ్‌ ఈఈ రమేశ్‌ బాబు మంగళవారం ప్రకటనలో తెలిపా రు. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు పూణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ సంస్థ అన్ని పరీక్షలు, పరిశోధనలు నిర్వహించే పూర్తి బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు. పరీక్షల ఫలితాల ఆధారంగా బ్యారేజీ పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించారన్నారు. వివిధ పరీక్షలు నిర్వహించాలంటే బ్యారేజీ ప్రాంతం పూర్తిగా ఇసుక, నీరు లేకుండా స్వచ్ఛంగా ఉండాలని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ స్పష్టంగా తెలియజేసిందన్నారు. ప్ర తీ సంవత్సరం అన్నారం బ్యారేజీ అప్‌, డౌన్‌స్ట్రీ మ్‌ ప్రాంతాల్లో భారీగా ఇసుక పేరుకుపోతుందని, ఈ నేపథ్యంలో ముందుగానే ఇసుక తొలగింపు (డిసిల్టేషన్‌) ప్రతిపాదన చేశారని తెలిపారు. ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీలు సాగునీటి శాఖ, టీజీఎండీసీ అధికారుల పర్యవేక్షణలోనే అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు పనులు నిర్వహిస్తున్నాయన్నారు. బ్యారేజీ నిర్మాణంపై అవసరమైన పరీక్షలు చేయాలంటే నిర్మాణ ప్రాంతం ఇసుక, నీరు లేకుండా ఉండడం తప్పనిసరన్నారు. బ్యారేజీలోని వెంట్ల భాగంలో ఇసుక తొలగింపు చేయకుండా గ్రిడ్‌ మార్కింగ్‌ చేయడం, విలువలు నమోదు చేయడం, కొలతలు తీసుకోవడం సాధ్యం కాదని, పరీక్షల నిర్వహణ కోసమే ఇసుక తొలగిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో బ్యారేజీ నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగడం లేదని, ఇది పూర్తిగా పియర్స్‌, ఫ్లోర్‌ భాగాల పరీక్షల కోసమే చేపట్టిన ప్రత్యేక సందర్భం కాగా, నిర్మాణంపై ఉన్న ఇసుక మాత్రమే తొలగిస్తున్నారన్నారు. కానీ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అన్నారం బ్యారేజీ వద్ద ఎలాంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం లేదని, అన్ని పనులు ఇరిగేషన్‌శాఖ, టీజీఎండీసీ అధికారుల పర్యవేక్షణ లోనే జరుగుతున్నాయని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement